AP Heatwave Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రానున్న రెండు రోజుల్లో ఈ ప్రాంతాల్లో వడ గాలులు..
AP Heatwave Alert: మార్చి నెల మధ్యలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా వడగాలు తీవ్రత బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ వడగాలుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒకేసారి పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్..
AP Heatwave Alert: మార్చి నెల మధ్యలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా వడగాలు తీవ్రత బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ వడగాలుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒకేసారి పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాష్ట్రంలో వడగాలులు వీచే అవకాశం ఉన్న మండలాల జాబీతాను విడుదల చేసింది.
ఈ వివరాల ప్రకారం శుక్రవారం రాష్ట్రంలోని మొత్తం 14 మండలాల్లో వడగాలులు వీచినట్లు తెలిపారు. అయితే 656 మండలాల్లో మాత్రం ఎలాంటి ప్రభావం లేదు. ఇదిలా ఉంటే రాగల 24 గంటల్లో రాష్ట్రంలో 3 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటిలో విజయనగరంలో 2, కడప జిల్లాలో 1 మండలం ఉంది. ఇక రానున్న 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా ఏయే మండలాల్లో వడగాలు ప్రభావం ఉందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Holi 2022: ఆంధ్రపదేశ్‌లో హొలీ వేడుకలు వెరీవెరీ స్పెషల్.. ఆడవారిగా మారే మగవాళ్ళు
SS Rajamouli: డార్లింగ్ గురించి సంచలన కామెంట్స్ చేసిన జక్కన్న.. షాక్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్