AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2022: ఆంధ్రపదేశ్‌లో హొలీ వేడుకలు వెరీవెరీ స్పెషల్.. ఆడవారిగా మారే మగవాళ్ళు

Holi 2022: దేశవ్యాప్తంగా హొలీ సంబరాలు(Holi Celebrations) అంబరాన్ని తాకుతున్నాయి. ఈ రంగుల పండగను దేశంలో వివిధ ప్రాంతాల వారు వివిధ రకాలుగా జరుపుకుంటారు. కొందరు పిడకలతో కొట్టుకుంటే..

Holi 2022: ఆంధ్రపదేశ్‌లో హొలీ వేడుకలు వెరీవెరీ స్పెషల్.. ఆడవారిగా మారే మగవాళ్ళు
Unique Holi Tradition In Ku
Surya Kala
|

Updated on: Mar 18, 2022 | 4:53 PM

Share

Holi 2022: దేశవ్యాప్తంగా హొలీ సంబరాలు(Holi Celebrations) అంబరాన్ని తాకుతున్నాయి. ఈ రంగుల పండగను దేశంలో వివిధ ప్రాంతాల వారు వివిధ రకాలుగా జరుపుకుంటారు. కొందరు పిడకలతో కొట్టుకుంటే.. మరికొందరు చెప్పులతో కొట్టుకుంటారు.. ఇంకొందరు రంగులను జల్లుకుంటూ వసంతానికి వెల్కమ్ పలుకుతారు..మరి ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) లోని కర్నూలు జిల్లా(Kurnool District) లో కూడా హొలీ వేడుకలను వింత ఆచారంలో జరుపుకుంటారు. ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు గ్రామంలో రంగుల కేళీ హొలీ పండగ వచ్చిందంటే.. జంబలికిడి పంబ సినిమా కనిపిస్తుంది. మగాళ్లంతా ఆడాళ్ళుగా మారిపోయి హొలీ వేడుకలను నిర్వహించకుంటారు.

కర్నూలు జిల్లాల ఆదోని మండలం సంతేకుడ్లుర్ గ్రామంలో హోలీ రోజున వింత ఆచారం కొనసాగుతోంది. ప్రతి ఏడాది చిన్న పెద్ద మగవాళ్ళు స్త్రీ వేషధారణలోకి మారిపోతారు. చీర కట్టుకొని, నగలు, పూలు అలంకరించుకుని.. అచ్చం అతివలుగా రెడీ అవుతారు.  ఇలా ఆడవారి వేషంలో హోళీరోజున రతీ మన్మథులను పూజిస్తారు. ఇలా హోళీరోజున మగవాళ్ళు స్త్రీ వేషంలో దేవుడిని పూజించే ఈ ఆచారం తరతారాల నుంచీ కొనసాగుతోందని గ్రామస్థులు చెప్పారు.

ఇలా చేయడం వలన తమ గ్రామానికి కష్టాలు రాకుండా ఉంటాయని.. పంటలు బాగా పండుతాయని.. గ్రామస్థుల నమ్మకం. ఈ హొలీ వేడుకలను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా జనం వస్తారు.  ఈహోలీ వేడుకలను రెండు రోజుల పాటు గ్రామస్థులు ఘనంగా నిర్వహిస్తారు.

Also Read: Donald Trump: క‌న్‌స్ట్ర‌క్ష‌న్ వ‌ర్క‌ర్‌గా డొనాల్డ్ ట్రంప్‌.. అసలు విషయం తెలిస్తే షాక్..