AP News: మద్యం కంపెనీలన్నీ వైసీపీ నేతలవే.. టీడీపీ లీడర్ సోమిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీపై టీడీపీ లీడర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ధనదాహంతో ఊరూ పేరూ లేని మద్యం, కల్తీసారా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు..

AP News: మద్యం కంపెనీలన్నీ వైసీపీ నేతలవే.. టీడీపీ లీడర్ సోమిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
Somireddy
Follow us

|

Updated on: Mar 18, 2022 | 8:14 PM

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీపై టీడీపీ లీడర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ధనదాహంతో ఊరూ పేరూ లేని మద్యం, కల్తీసారా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నాసిరకం మద్యంతో ఏటా రూ.5 వేల కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో మద్యం తయారీ సంస్థలన్నీ మంత్రులు, వైసీపీ నేతలవేనని ఆరోపించారు. కల్తీ మద్యం తాగేవారి మెదడు, నాడీ, జీర్ణ వ్యవస్థ దెబ్బతిని ప్రాణాలు పోతున్నాయని ల్యాబ్‌ నివేదికలో తేలిందన్నారు. జంగారెడ్డిగూడెంలో 28 మంది చనిపోకముందే ప్రభుత్వం నాటు సారా నిల్వలను ధ్వంసం చేసి ఉండాల్సిందని సోమిరెడ్డి అన్నారు. మరోవైపు.. తమ పార్టీ లీడర్ల ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఓ సాఫ్ట్ వేర్ ద్వారా వైసీపీ నేతలు ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్లు తాము అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అఁశంపై గతంలోనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ బహిర్గతం చేయలేదన్నారు.

పెగాసెస్ స్పై వేర్ చంద్రబాబు కొనుగోలు చేశారన్నది అవాస్తవమన్న సోమిరెడ్డి.. దేశాల మధ్య రహస్యాలు తెలుసుకునేందుకు ఈ సాఫ్ట్ వేర్ రూపొందించారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈ పెగాసెస్ స్పైవేర్ మీద అవగాహన లేకుండా ఉండొచ్చని భావిస్తున్నామని చెప్పారు. పెగాసెస్ స్పై వేర్ ను నాటి ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే వైఎస్. వివేకా హత్య జరిగి ఉండేది కాదని సోమిరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా ఈ స్పై వేర్ ను కొనుగోలు చేసే అవకాశం లేదన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వంపై ఉన్న ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు ఎంక్వైరీ కమిషన్ వేసిందని చెప్పారు.

పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేసే చట్టవ్యతిరేక కార్యకలాపాలను చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. చంద్రబాబును, లోకేశ్ ను పీకే తన వ్యూహాలతో తీవ్రంగా డామేజ్ చేసి అడ్వాంటేజ్ తీసుకున్నారు. కోడికత్తి, వివేకా హత్య విషయంలో టీడీపీపై ఆరోపణలు పీకే వ్యూహాలే. పశ్చిమ బెంగాల్లో మమత కాలుకు కట్టు కట్టించి రాజకీయం చేసింది పీకేనే. పెగాసెస్ స్పై వేర్ ను చంద్రబాబు కొనుగోలు చేశారని మమత బెనర్జీకి పీకేనే తప్పుడు సమాచారం అందించారని నమ్ముతున్నాం.

                 – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేత

Also Read

chinna jeeyar swamy: సమ్మక్క- సారక్కల మీద వ్యాఖ్యలపై చినజీయర్​స్వామి ఫుల్ క్లారిటీ

Cherry-Tarak: ప్రపంచానికి తెలియని స్నేహం మాది.. మేము భిన్న ధ్రువాలం.. అందుకే చెర్రీ అంటే ఇష్టం అంటున్న తారక్

భారత్‌లో నెక్ బ్యాండ్ ఇయర్‌ఫోన్స్.. ధర ఎంత అంటే