AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడలో క్రికెట్ బెట్టింగ్​ ముఠా, రెండోసారి బుక్కయ్యారు

విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరసగా పోలీసులు దాడులు చేసి అరెస్టులు చేస్తున్నప్పటికీ ముఠాలు దందాను వీడటం లేదు.

విజయవాడలో క్రికెట్ బెట్టింగ్​ ముఠా, రెండోసారి బుక్కయ్యారు
Ram Naramaneni
|

Updated on: Oct 24, 2020 | 7:50 PM

Share

విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరసగా పోలీసులు దాడులు చేసి అరెస్టులు చేస్తున్నప్పటికీ ముఠాలు దందాను వీడటం లేదు. తాజాగా నగర పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న గ్యాంగ్‌లపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేయడంతోపాటు ఏడున్నర లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఒక ల్యాప్‌టాప్‌, 20 ఫోన్లు కలిగిన కమ్యూనికేటర్‌ బాక్సు, ఒక టీవీ, 13 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పెనమలూరు పోలీసుస్టేషను పరిధిలోని మురళీనగర్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ చేస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో  తనిఖీలు చేసినట్లు  డీసీపీ వి.హర్షవర్దనరాజు తెలిపారు.

క్రికెట్‌ మజా-11 అనే యాప్‌ ద్వారా ఇవాళ జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ ఐపీఎల్​2020 మ్యాచ్​కు బెట్టింగ్‌ నిర్వహించారని చెప్పారు. అరెస్టు అయిన వారిలో విజయవాడ మెగల్రాజపురానికి చెందిన వీరపనేని కల్యాణ్‌చక్రవర్తిపై గతంలోనూ కేసు నమోదైందన్నారు. పాత నేరస్థులపై గట్టి నిఘా ఉంచామని తెలిపారు. యువత బెట్టింగ్ భూతానికి దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Also Read :

అక్కడ బుల్లెట్‌కు పూజలు, గుడి కూడా కట్టేశారు !

హైదరాబాదులో పాల ఏటీఎం

Follow Us