AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలానో అంటే!

ఒకరు ఎలాంటి వారు, వారి అటవాట్లేంటి, వారి వ్యక్తిత్వం ఎలాంది అనేవి.. వారితో కాసేపు కూర్చొని మాట్లాడితే తెలిసిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.. కానీ ఒక వ్యక్తి శరీర భాగాల ఆకారం, వారి నడవడిక ఆధారంగా కూడా అతని వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చని మీకు తెలుసా?.. అవును ఒక వ్యక్తి పడుకునే భంగిమను బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవచ్చ.. ఎలానో చూద్దాం పదండి.

Personality Test: పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలానో అంటే!
Personality Test
Anand T
|

Updated on: Dec 18, 2025 | 11:56 AM

Share

ప్రతి ఒక్కరికి తమ గురించి, తమ పక్కవాళ్ల గురించి తెలుసుకోవాలని ఉంటుంది. చాలా మంది తామ గురించి తెలుసుకునేందుకు జోతిష్యుల దగ్గరకు వెళ్తూ ఉంటారు. కానీ వారి శీరర భాగాల ఆకారం, వారి నడవడిక ఆధారంగా కూడా తమ వ్యక్తిత్వం ఎలాంటి తెలుసుకోవచ్చని చాలా మంది తెలియదు. అవును అస్తముద్రికంలో చేతి రేఖలను బట్టి ఎలాగైతే.. జ్యోతిష్యులు మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారో.. అదే విధంగా మనం పడుకునే పోజిషన్స్‌ను బట్టి కూడా మన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం.. మనం నిద్రించే భంగిమ మనం ఎలాంటి వాళ్లలో, మన స్వభావం ఎలాంటిదో తెలిజేస్తుందట. కాబట్టి, మీరు ఎలాంటి పోజిషన్స్‌లో పడుకుంటున్నారో చూసి.. దాని ఆధారం మీరు ఎలాంటి వారో ఇక్కడ తెలుసుకోండి.

మీరు పడుకునే భంగిమే మీ వ్యక్తిత్వం

వెల్లకిలా పడుకునే వారు: వెల్లకిలా పడుకునే అలవాటు ఉన్న వ్యక్తులు ఆశావాదులని అర్థం. వీరు ఎప్పుడూ త్వరగా నిద్రలేస్తారు. అలాగే రోజంతా యాక్టీవ్‌గా ఉంటారు. వీళ్లకు తమపై తమకు నమ్మకం ఎక్కువ.. అంతేకాకుండా అనుకున్న లక్ష్యాలను సాధించడంలో చాలా కచ్చితంగా వ్యవహరిస్తారు. ఏపని చేసినా పట్టుదలతో ఉంటారు. వీరు విశాల దృక్పథం కలిగి ఉంటారు. వీళ్లు స్నేహానికి ఎక్కువగా ప్రాధన్యం ఇస్తారు.

వన్‌సైడ్ పడుకునే వ్యక్తులు: చాలా మందికి ఒకపక్కమీద పడుకునే అలవాటు ఉంటుంది. ఎడమ లేదా కుడివైపు, ఒక సైడ్‌ తిరిగి పడుకునే వ్యక్తులు చాలా ప్రశాంతమైన వారని అర్థం. వీళ్లు చాలా నమ్మకంగా ఉంటారు. అంతేకాకుండా..వీరు గడిచిన క్షణాల గురించి బాధపడకుండా.. భవిష్యత్తును ఎలా అందంగా మలుచుకోవాలో ఆలోచిస్తూ ఉంటారు. వీళ్లు జీవితంలో ఎదురైయ్యే పరిస్థితులకు అనుగునంగా తమనుతాము మార్చుకుంటారు. ఎంతటి కష్టాలనైనా చిరునవ్వుతో ఎదుర్కొంటారు.

బోర్లా( కడుపుపై) నిద్రపోవడం: చాలా మంది కడుపు మీద( బోర్లా) పడుకునే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఉన్నవారూ ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ప్రశాంతంగా ఉంటారట. అలాగే జీవితంపై ఫోకస్‌గా ఉంటారట. వీళ్లు సామాజికంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే వీళ్లు పక్కవారిపై డిపెండ్‌ కాకుండా స్వతంత్ర్యంగా ఉండాలనుకుంటారు. వీళ్లు జీవితంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారట.

ఒక పక్కకు తిరిగి చేయి చాచి పడుకునే వారు: కొందరు వింతగా ఒకసైడ్‌కు తిరిగి చేయి బయటకు చాచి పడుకుంటారు. ఈ అలవాట్లు ఉన్నవారు ఇతరులతో చాలా ఓపెన్‌గా ఉంటారు. కానీ ఎవరీ అంత ఈజీగా నమ్మరు. ఎవరినైనా నమ్మితే వాళ్లను ఎప్పటికీ వదిలిపెట్టరు. అలాగే వీరు ఎక్కువగా ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడుతారు.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా అందించబడినవి.. వీటిపై వీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.