పాఠశాలలు తెరిచేందుకు కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు

పాఠశాలలను తెరిచేందుకు కేంద్ర విద్యాశాఖ  మార్గదర్శకాలను విడుదల చేసింది. అక్టోబరు 15 తర్వాత స్కూళ్లు, విద్యాసంస్థలను తెరవచ్చని స్పష్టం చేసింది.

పాఠశాలలు తెరిచేందుకు కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 05, 2020 | 11:16 PM

పాఠశాలలను తెరిచేందుకు కేంద్ర విద్యాశాఖ  మార్గదర్శకాలను విడుదల చేసింది. అక్టోబరు 15 తర్వాత స్కూళ్లు, విద్యాసంస్థలను తెరవచ్చని స్పష్టం చేసింది. దశల వారీగా స్కూళ్లు తెరవాలని సూచించింది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని.. స్థానిక అవసరాల మేరకు ఎస్​ఓపీ(స్టాండర్డ్​ ఆపరేటింగ్​ ప్రొసీజర్​)ను రూపొందించే అధికారాలను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు  అధికారాలిచ్చింది.

అయితే విద్యార్థుల హాజరుపై కొంత వెసులుబాటు కల్పించాలని విద్యాశాఖ పేర్కొంది. స్కూళ్లు తెరుచుకున్న 2-3 వారాల వరకు ఎలాంటి అసెస్​మెంట్లు ఉండకూడదని వివరించింది. ఇప్పటివరకు ఆన్​లైన్​లో క్లాసులకు హాజరవుతోన్న విద్యార్థులు.. ఇప్పుడు పాఠశాలలకు చేరుకునే ప్రక్రియ వీలనైంత సులభంగా ఉండాలని విద్యాశాఖ వెల్లడించింది. ( తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, తగ్గిన ఆర్‌- వాల్యూ )