అక్కడ సాయుధ దళాల సాయంతో టీకా పంపిణీ..!
వ్యాక్సిన తయారీ కోసం విశ్వవ్యాప్తంగా వందలాది డ్రగ్స్ కంపెనీలు కుస్తీ పడుతున్నాయి. అయితే, కొవిడ్ టీకా అందుబాటులోకి వస్తే దాని పంపిణీ దేశాలముందున్న అతిపెద్ద సవాలు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రాకాసి నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన తయారీ కోసం విశ్వవ్యాప్తంగా వందలాది డ్రగ్స్ కంపెనీలు కుస్తీ పడుతున్నాయి. అయితే, కొవిడ్ టీకా అందుబాటులోకి వస్తే దాని పంపిణీ దేశాలముందున్న అతిపెద్ద సవాలు. ఇందుకోసం అన్ని దేశాలు పక్కా ఫ్లాన్ చేసుకుంటున్నాయి. కాగా, వ్యాక్సిన్ పంపిణీకి బ్రిటన్ దేశం సాయుధ దళాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బ్రిటీష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాంకాక్ వెల్లడించారు.
‘టీకా పంపిణీలో నేషనల్ హెల్త్ సర్వీస్, సాయుధ దళాలు కలిసి పనిచేస్తాయని హాంకాక్ కన్జర్వేటివ్ పార్టీ వార్షిక వర్చువల్ సమావేశంలో ఆయన తెలిపారు. వ్యాక్సిన్ అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్ మాత్రమే కాదు..దానిని ప్రాధాన్యతా వర్గాలకు అనుగుణంగా పంపిణీ చేయడం కూడా చూసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అందరికీ సమంగా వ్యాక్సిన అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్‌హెచ్‌ఎస్ కొవిడ్-19 యాప్‌ను 15 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని హాంకాక్ ధ్రువీకరించారు. దేశం సురక్షితంగా, సాధ్యమైనంత వేగంగా వ్యాక్సిన్ పొందడానికి తాము చేయగలిగినంత కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
Our strategy is to suppress the virus, protecting the economy, education & the NHS, until we get a vaccine.#CPC20 pic.twitter.com/F9dxApqNIz
— Matt Hancock (@MattHancock) October 5, 2020