విజయ్ మాల్యా ఇండియాకు వచ్చేది ఎప్పుడు?

బ్యాంకులను నిండా ముంచేసి యూకే పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను దేశానికి తీసుకురావడానికి బ్రిటిష్ కోర్టు ఆదేశించిందని, కానీ ఆ దేశంలో...

విజయ్ మాల్యా ఇండియాకు వచ్చేది ఎప్పుడు?
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 05, 2020 | 10:59 PM

కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తూ కుటుంబ సభ్యులకు మాల్యా నగదు బదిలీ చేసిన విషయంలో సుప్రీం కోర్టులో దాఖలైన అఫిడవిట్‌పై సోమవారం విచారణ జరిగింది. బ్యాంకులను నిండా ముంచేసి యూకే పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను దేశానికి తీసుకురావడానికి బ్రిటిష్ కోర్టు ఆదేశించిందని, కానీ ఆ దేశంలో ప్రారంభించిన రహస్య చట్టపరమైన చర్యలు ఆలస్యం అయ్యాయని  కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. “యూకేలో భారత ప్రభుత్వానికి తెలియని కొన్ని రహస్య చర్యలు ఉన్నాయి” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ కోర్టుకు వివరించింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో మాల్యాపై రహస్యంగా కొనసాగుతున్న చర్యల గురించి తెలియదని, ఈ ప్రక్రియలో భారత ప్రభుత్వం పార్టీ కాదని కేంద్రం తెలిపింది.  మాల్యాను రప్పించడానికి ఎలాంటి “రహస్య” చర్యలు జరుగుతున్నాయో నవంబర్ 2 లోగా కోర్టుకు తెలియజేయాలని జస్టిస్ యు యు లలిత్, అశోక్ భూషణ్ ధర్మాసనం మాల్యా న్యాయవాదిని కోరింది. 

Also Read : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, తగ్గిన ఆర్‌- వాల్యూ