AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020 Match 19: RCB vs DC : తేలిపోయిన ఆర్సీబీ, ఢిల్లీ ఏకపక్ష విజయం

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం దుబాయ్ వేదికగా  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 59 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది.

IPL 2020 Match 19: RCB vs DC : తేలిపోయిన ఆర్సీబీ, ఢిల్లీ ఏకపక్ష విజయం
Ram Naramaneni
|

Updated on: Oct 05, 2020 | 11:34 PM

Share

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం దుబాయ్ వేదికగా  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 59 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది. ఢిల్లీ నిర్ధేశించిన‌ 197 పరుగుల టార్గెట్‌ను చేధించడంలో ఆర్సీబీ తేలిపోయింది. అన్ని విభాగాల్లో రాణించిన ఢిల్లీ ఐపీఎల్‌లో మరో క్రేజీ‌ విజయాన్ని సొంతం చేసకుంది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  బెంగళూర్ బాట్స్‌మెన్స్ తీవ్రంగా విఫలమయ్యారు. ఓపెనర్లు దేవదూత్‌ పడిక్కల్‌(4) అరోన్‌ ఫించ్(13) జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత ఒక‌రి త‌రువాత ఒక‌రు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి వెంటనే పెవిలియన్ బాట పట్టారు. కెప్టెన్ కోహ్లీ ఒక్కడే 43 ( 39 బంతుల్లో2 ఫోర్లు, 1 సిక్స‌ర్‌) ప‌రుగులు చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఏ ద‌శ‌లోనూ ఆర్సీబీ పట్టుచూపించలేదు. దీంతో ఢిల్లీ విజయం ఏకపక్షమైంది. ఢిల్లీ బౌలర్ రబడ నాలుగు వికెట్లు తీసి ఆర్సీబీని కొలుకోలేని దెబ్బతీశాడు.  అలాగే నోర్జె, అక్షర్ ప‌టేల్‌ల‌కు చెరో 2 వికెట్లు ద‌క్కాయి. అశ్విన్ 1 వికెట్ తీశాడు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ  ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి ఆ జ‌ట్టు 196 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ల‌లో మార్క‌స్ స్టాయినిస్ 53 (26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)  ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే పృథ్వీ షా 42  (23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌లు) ప‌రుగులు చేశాడు. రిష‌బ్ పంత్ 37 ( 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ప‌రుగులు, శిఖ‌ర్ ధావ‌న్ 32 ( 28 బంతుల్లో 3 ఫోర్లు) సమిష్ఠిగా రాణించారు . దీంతో ఢిల్లీ భారీ స్కోరు చేయ‌గలిగింది. ఇక బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ 2 వికెట్లు తీయ‌గా, మొయిన్ అలీ, ఉదానాలు చెరొక వికెట్ దక్కించుకున్నారు. ( పాఠశాలలు తెరిచేందుకు కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు )

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!