AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: యముడి నుంచి ఫోన్.. కనెక్ట్ కాకపోవడంతో బతికిపోయిన బైకర్.. వీడియో చూస్తే..

కొండకోనల అందాలు, వర్షపు జల్లులు... రైడర్లకు ఇదొక డ్రీమ్ కాంబినేషన్.. కానీ,ఒక్క చిన్న అజాగ్రత్త ఆ అనుభూతిని శాశ్వత విషాదంగా మార్చేస్తుంది. పశ్చిమ బెంగాల్‌లోని లోతైన పర్వత మలుపుల్లో చోటుచేసుకున్న ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. క్షణాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం నుంచి ఒక రైడర్ ఎలా బయటపడ్డాడో చూస్తే... యమధర్మరాజు మిస్డ్ కాల్ ఇచ్చి వెళ్లాడా అన్నంతగా మైండ్ బ్లాక్ అవుతుంది..

Viral Video: యముడి నుంచి ఫోన్.. కనెక్ట్ కాకపోవడంతో బతికిపోయిన బైకర్.. వీడియో చూస్తే..
Biker Miraculous Escape From Fatal Accident
Krishna S
|

Updated on: Jul 23, 2026 | 6:02 PM

Share

వర్షంలో తడుస్తూ కొండల మధ్య బైక్ రైడింగ్ చేయడం ప్రతి రైడర్‌కు ఒక కల. కానీ కొద్దిపాటి అజాగ్రత్త, అధిక వేగం ఆ కలను క్షణాల్లో విషాదంగా మార్చేస్తాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ పర్వత ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ భయానక బైక్ ప్రమాద వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన వారెవరైనా సరే ఒక్కసారిగా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. సిలిగురి-డార్జిలింగ్ మధ్య ఎంతో సుందరమైన హిల్ స్టేషన్‌గా పేరుగాంచిన కుర్సియోంగ్ వ్యూ పాయింట్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. ఒక యువకుడు రెయిన్‌కోట్ ధరించి, వర్షంలో బైక్‌పై వెళ్తుండగా, ఒక మలుపు వద్ద వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డుపై జారిపడ్డాడు. అదుపు తప్పిన బైక్ పక్కనే ఉన్న రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది. ఆ ఇంపాక్ట్ ఎంత తీవ్రంగా ఉందంటే, రైడర్ వేసుకున్న బూటు గాలిలోకి ఎగిరి చాలా దూరంలో పడింది. మరోవైపు వందల అడుగుల లోతైన లోయ ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ బైకర్ రోడ్డుపైనే పడిపోవడంతో ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్నాడు.

యమరాజు మిస్డ్ కాల్ ఇచ్చి వెళ్లాడు.. నెటిజన్ల కామెంట్స్

ఈ భయంకరమైన వీడియో క్లిప్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “యమరాజు నుండి మిస్డ్ కాల్ వచ్చింది, కానీ లక్కీగా కనెక్ట్ అవ్వలేదు” అని ఒక యూజర్ కామెంట్ చేయగా..‘‘ణాల కంటే బైక్ పైనే అతనికి ప్రేమ ఎక్కువ ఉన్నట్లుంది” అని మరొకరు కామెంట్ చేశారు.మెజారిటీ నెటిజన్లు ఈ ఘటనను రైడర్ తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు.

డెహ్రాడూన్ పోలీసుల అవగాహన ప్రచారం..

ఈ వైరల్ వీడియోను ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ పోలీసులు తమ అధికారిక X హ్యాండిల్‌లో షేర్ చేశారు. పర్వత ప్రాంతాల్లో, వర్షకాలంలో డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో వివరించడానికి ఈ ఘటనను ఒక హెచ్చరికగా తెలిపారు. ‘‘వర్షాకాలంలో రోడ్లు జారేలా ఉంటాయి. కొండ ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు మలుపుల వద్ద వేగాన్ని తగ్గించి, పూర్తి జాగ్రత్తలతో వాహనాలు నడపాలి. మీ ప్రాణం మీ కుటుంబానికి ఎంతో విలువైనది’’ అని పోలీసులు పోస్ట్ చేశారు.

వీడియో చూడండి..

Follow Us
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!
ఇదెక్కడి బాల్ రా సామీ.. ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్
ఇదెక్కడి బాల్ రా సామీ.. ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్
రాత్రిపూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్య లాభాలు
రాత్రిపూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్య లాభాలు