AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

QNET కేసులో కీలక పరిణామం.. గోవా లగ్జరీ రిసార్టులో బయటపడ్డ బండారం..!

కోట్ల రూపాయల మోసానికి సంబంధించిన క్యునెట్ (QNET) కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. గోవాలోని నోవోటెల్ రిసార్ట్‌లో నిర్వహించిన "Ocean 25th Anniversary" కార్యక్రమంపై దాడులు నిర్వహించారు. కేరళకు చెందిన ఐదుగురు క్యునెట్ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన కొందరు నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించగా, కీలక వ్యక్తులు ఐదుగురిని అరెస్ట్ చేయడంలో పోలీసులు విజయవంతమయ్యారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

QNET కేసులో కీలక పరిణామం.. గోవా లగ్జరీ రిసార్టులో బయటపడ్డ బండారం..!
Qnet ScamImage Credit source: AI Image
Balaraju Goud
|

Updated on: Jul 23, 2026 | 5:38 PM

Share

కోట్ల రూపాయల మోసానికి సంబంధించిన క్యునెట్ (QNET) కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. గోవాలోని నోవోటెల్ రిసార్ట్‌లో నిర్వహించిన “Ocean 25th Anniversary” కార్యక్రమంపై దాడులు నిర్వహించారు. కేరళకు చెందిన ఐదుగురు క్యునెట్ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన కొందరు నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించగా, కీలక వ్యక్తులు ఐదుగురిని అరెస్ట్ చేయడంలో పోలీసులు విజయవంతమయ్యారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో నమోదైన కేసు ఆధారంగా చేపట్టిన దర్యాప్తులో, నిందితులు సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి అమాయకులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాధితులను పరిచయం చేసుకుని, వ్యాపార అవకాశాల పేరుతో వారిని ఆకర్షించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం జూమ్ సమావేశాలు, ఫోన్ కాల్స్ నిర్వహిస్తూ, భారీ ఆదాయం వస్తుందని నమ్మించి ఒక్కో వ్యక్తి నుంచి సుమారు రూ.7.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టేలా ఒత్తిడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా, కొత్త సభ్యులను సంస్థలో చేర్చితే మరింత ఆదాయం వస్తుందని హామీ ఇస్తూ మల్టీలెవల్ మార్కెటింగ్ విధానంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కీలక డిజిటల్ ఆధారాలను సేకరించిన హైదరాబాద్ పోలీసులు గోవాలో మెరుపు దాడి చేశారు. ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, మూడు లగ్జరీ కార్లు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వాట్సాప్ చాట్‌లు, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల వివరాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు.

పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ కేసులో మరికొందరి ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. డిజిటల్ ఆధారాల విశ్లేషణ, ఆర్థిక లావాదేవీల పరిశీలన అనంతరం మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అమాయకులను అధిక లాభాల పేరుతో మోసం చేసే ఇలాంటి పథకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు. QNET కేసును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సీరియస్‌గా తీసుకుని, స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
లగ్జరీ రిసార్ట్‌లో QNET గుట్టు.. పోలీసుల మెరుపు దాడి!
లగ్జరీ రిసార్ట్‌లో QNET గుట్టు.. పోలీసుల మెరుపు దాడి!
ఉజ్జయిని నుంచి సికింద్రాబాద్‌కు మహంకాళి అమ్మవారు ఎలా వచ్చారు..?
ఉజ్జయిని నుంచి సికింద్రాబాద్‌కు మహంకాళి అమ్మవారు ఎలా వచ్చారు..?
ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ప్రత్యేకతలు ఏంటి..?
ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ప్రత్యేకతలు ఏంటి..?
ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. బ్యాంకాక్ ప్రయాణికుడి బ్యాగులో కదులుతూ
ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. బ్యాంకాక్ ప్రయాణికుడి బ్యాగులో కదులుతూ
అతడి యాక్టింగ్ చూసి కాళ్లపై పడిపోయా..
అతడి యాక్టింగ్ చూసి కాళ్లపై పడిపోయా..
ఆమెను నిందించడం కాదు.. ముందు ఇది తెలుకో.. మగవారి సంతానోత్పత్తిపై
ఆమెను నిందించడం కాదు.. ముందు ఇది తెలుకో.. మగవారి సంతానోత్పత్తిపై
ఆ హీరో నాకు దేవుడితో సమానం.. రెండుసార్లు నన్ను కాపాడాడు..
ఆ హీరో నాకు దేవుడితో సమానం.. రెండుసార్లు నన్ను కాపాడాడు..
ఇటుక కూడా కదలకుండా ఇల్లును వెనక్కి నెడుతున్నారు.. ఎలాగంటే..?
ఇటుక కూడా కదలకుండా ఇల్లును వెనక్కి నెడుతున్నారు.. ఎలాగంటే..?
ఈ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు! నిర్వస్త్ర వ్రతం వెనుక కథ
ఈ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు! నిర్వస్త్ర వ్రతం వెనుక కథ
ఈ తేదీల్లో పుట్టినవారి కలలు నిజమవుతాయా? భవిష్యత్తును ముందే పసి..
ఈ తేదీల్లో పుట్టినవారి కలలు నిజమవుతాయా? భవిష్యత్తును ముందే పసి..