AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తల్లిదండ్రులకు బిగ్‌ రిలీఫ్.. ఆ విషయంలో ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం సీరియస్ వార్నింగ్!

తెలంగాణ విద్యాశాఖ ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రుల వ్యక్తిగత సమాచారాన్ని థర్డ్-పార్టీ ఏజెన్సీలకు విక్రయిస్తే చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించింది. డేటా గోప్యతను కాపాడి, విద్యార్థుల ప్రైవసీకి భంగం కలిగించకుండా చూడాలని రాష్ట్రంలోని అన్ని పాఠశాలకు ఆదేశాలు జారీ చేసింది.

Telangana: తల్లిదండ్రులకు బిగ్‌ రిలీఫ్.. ఆ విషయంలో ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం సీరియస్ వార్నింగ్!
Elangana Govt Warns Private Schools
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: May 26, 2026 | 6:01 PM

Share

ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ గట్టి హెచ్చరిక జారీ చేసింది. అడ్మిషన్ల పేరుతో సేకరిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వ్యక్తిగత సమాచారాన్ని కొందరు అక్రమార్కులు ప్రైవేట్ ఏజెన్సీలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ కీలక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల పేర్లు, వారి మొబైల్ నంబర్లు, తల్లిదండ్రులు లేదా గార్డియన్ల ఫోన్ నంబర్లు, ఇంటి అడ్రస్ వంటి అత్యంత గోప్యమైన, సున్నితమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ప్రైవేట్ వ్యక్తులకు గానీ, థర్డ్ పార్టీ ఏజెన్సీలకు గానీ, అనధికారిక సంస్థలకు గానీ చేరవేయకూడదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి డేటాను విక్రయించినా, దుర్వినియోగానికి పాల్పడినా చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

రాష్ట్రంలోని అందరు రీజినల్ జాయింట్ డైరెక్టర్లు (RJD), జిల్లా విద్యాశాఖాధికారులు (DEO), ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల డేటాను కేవలం అధికారిక విద్యా సంబంధిత అవసరాలకు, నిబంధనలకు లోబడి మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. డేటా లీకేజీకి పాల్పడే ప్రైవేట్ విద్యాసంస్థలపై, బాధ్యులైన వ్యక్తులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలుచ, క్రిమినల్ విచారణ ప్రారంభించనున్నట్లు హెచ్చరించారు.

ఇటీవల కాలంలో విద్యార్థుల తల్లిదండ్రుల నంబర్లకు రకరకాల ప్రమోషనల్ కాల్స్, ఫేక్ లోన్ ఆఫర్లు, అపరిచిత మెసేజ్‌లు వస్తూ వేధిస్తుండటంతో.. స్కూళ్లు, కాలేజీల నుంచే ఈ డేటా లీక్ అవుతుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల ప్రైవసీకి పెద్ద ఊరటనిస్తుందని చెప్పవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us