Dubbaka By-poll: టీఆర్ఎస్, బీజేపీ నామినేషన్లు దాఖలు

దుబ్బాక ఉప ఎన్నిక రోజురోజుకూ రక్తి కడుతోంది. తాజాగా రెండు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పరస్పరం సెటైర్లు రువ్వుకుని, పరస్పరం విమర్శలు చేసుకున్నారు.

Dubbaka By-poll: టీఆర్ఎస్, బీజేపీ నామినేషన్లు దాఖలు
Follow us
Rajesh Sharma

|

Updated on: Oct 14, 2020 | 7:03 PM

TRS BJP candidates filed nominations: దుబ్బాక ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. బుధవారం నాడు ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెంటరాగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున దివంగత రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత ముందుగా నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వెంటరాగా.. ఆ పార్టీ తరపున రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేశారు.

గులాబీ శ్రేణులు భారీ సంఖ్యలో ఊరేగింపుగా వచ్చినప్పటికీ… నామినేషన్ దాఖలును అత్యంత నిరాడంబరంగా నిర్వహించారు మంత్రి హరీశ్ రావు. తనతోపాటు అభ్యర్థి సుజాత, స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రమే నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాష్ట్రానికి నిధులివ్వని బీజేపీకి ఈ ఉప ఎన్నికలో బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

కాగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అత్యంత అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌తో కలిసి ఆయన ఊరేగింపు నిర్వహించారు. సంజయ్, రఘునందన్ రావులు పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. రఘునందన్ రావును గెలిపించడం ద్వారా అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసే ఓ ఎమ్మెల్యేను పంపాలని సంజయ్ ప్రజలను కోరారు. కాగా.. ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులు బుధవారం నామినేషన్ దాఖలు చేయగా.. గురువారం నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి రెడీ అవుతున్నారు. అక్టోబర్ 16వ తేదీతో నామినేషన్ల పర్వ ముగియనున్నది.

Also read: కుంగిన రోడ్డు.. ప్రమాదంలో మెట్రో పిల్లర్

Also read: రెండోతరం వాక్సిన్‌తోనే సాధారణ స్థితి

Also read: చంద్రబాబుకు ఛాన్సివ్వండి..హైకోర్టు ఆదేశం

Also read: అక్టోబర్ 28న కృష్ణా రివర్ బోర్డు భేటీ

Also read: నవంబర్ 9న రాజ్యసభ ఎన్నికలు

Also read: కోలుకున్న గేల్.. బెంగళూరుతో మ్యాచ్‌కు రెడీ

Also read: మహేశ్ హత్యకేసులో ఇద్దరి అరెస్టు!