AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ 4: ‘టాప్’ లేపుతున్న ఆ ఇద్దరు.. ఫైనల్ ఫైవ్‌లో ఎవరుంటారో.?

Bigg Boss 4: బిగ్ బాస్ హౌస్‌లో పరిణామాలు రోజుకో రకంగా మారిపోతున్నాయి. మొన్నటివరకు అభిజిత్-మోనాల్-అఖిల్ లవ్ స్టోరీ నడిచింది. ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా టాస్కుల పుణ్యమా అని మిత్రులు శత్రువులుగా మారిపోతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఈ సీజన్‌లో చాలామంది కంటెస్టెంట్లు ప్రేక్షకులకు కొత్త ముఖాలే. మొదటి రెండు వారాలు సోసోగానే ఉన్నా.. తర్వాత ఒక్కొక్కరి టాలెంట్ బయటపడుతోంది. ఫ్యాన్స్‌కు ఎంటర్టైన్మెంట్ కూడా కావాల్సినంత దొరుకుతోంది. మరోవైపు ఈ […]

బిగ్ బాస్ 4: 'టాప్' లేపుతున్న ఆ ఇద్దరు.. ఫైనల్ ఫైవ్‌లో ఎవరుంటారో.?
Ravi Kiran
|

Updated on: Oct 14, 2020 | 6:29 PM

Share

Bigg Boss 4: బిగ్ బాస్ హౌస్‌లో పరిణామాలు రోజుకో రకంగా మారిపోతున్నాయి. మొన్నటివరకు అభిజిత్-మోనాల్-అఖిల్ లవ్ స్టోరీ నడిచింది. ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా టాస్కుల పుణ్యమా అని మిత్రులు శత్రువులుగా మారిపోతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఈ సీజన్‌లో చాలామంది కంటెస్టెంట్లు ప్రేక్షకులకు కొత్త ముఖాలే. మొదటి రెండు వారాలు సోసోగానే ఉన్నా.. తర్వాత ఒక్కొక్కరి టాలెంట్ బయటపడుతోంది. ఫ్యాన్స్‌కు ఎంటర్టైన్మెంట్ కూడా కావాల్సినంత దొరుకుతోంది.

మరోవైపు ఈ బిగ్ బాస్‌ సీజన్‌లో కంటెస్టెంట్ల ఆటతీరును బట్టి టాప్ ఫైవ్‌లో ఎవరుంటారన్నది ప్రేక్షకులు ఇప్పుడే చెప్పేస్తున్నారు. నిజానికి టాప్ 5 గురించి ఆలోచించడానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా, ఆట పరంగా చూసుకుని ఆడియన్స్ అప్పుడే మార్కులు వేసేస్తున్నారు.

మరి ఆ లిస్టులో టాప్ కంటెస్టెంట్‌గా అభిజిత్ ఉంటాడని అభిమానులు అనుకుంటున్నారు. ఏ విషయాన్ని అయినా కూల్‌గా సాల్వ్ చేయడం.. తను తప్పు చేసినా.. తాను తప్పు చేసినట్లు వేరే కంటెస్టెంట్లు చెప్పినా.. వెంటనే సారీ చెబుతున్నాడని అంటున్నారు. హౌస్‌మేట్స్ అందరితోనూ కలవాలని ప్రయత్నిస్తున్నాడని… ఇవే అభిజిత్‌ను టాప్ 5లో నిలబెడతాయని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రెండో వైల్డ్ కార్డు ఎంట్రీగా హౌస్‌లో ఎంటరైన అవినాష్ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. తనదైన శైలి కామెడీతో హౌస్‌లో నవ్వులు పూయిస్తున్నాడు. ఇక ఈ మధ్య అరియనా-అవినాష్‌ల కాంబినేషన్‌లో వచ్చే ఎపిసోడ్స్ ఎంటర్టైన్మెంట్ పీక్స్ అని చెప్పాలి. అలాగే గొడవలకు వెళ్లకుండా సరదాగా ఉంటూ అందరిని నవ్విస్తున్న అవినాష్ టాప్ ఫైవ్‌లో ఉంటాడని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.

అలాగే సోహైల్, అఖిల్ కూడా టాస్క్ ఇవ్వాలే కానీ ప్రతీసారి తమ సత్తాను చూపిస్తున్నారు. ఆయా టాస్కుల్లో 100 శాతం ఎఫర్ట్ పెట్టి తమ స్క్రీన్ ప్రజెన్స్‌ను పెంచుకుంటున్నారు. అటు అరియనా కూడా ప్రతీ టాస్క్‌లో అదరగొడుతోంది. ఇదే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా టాప్ ఫైవ్‌లో వీరి ముగ్గురు ఉంటారని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక లాస్య కూడా బిగ్ బాస్ టాప్ ఫైవ్‌లో ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆమెకు బయట ఫుల్ సపోర్ట్ ఉండటం.. ఒక ప్లస్.. కానీ లాస్య ఒక్కోసారి డల్ అవుతోంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న లాస్య టాప్ ఫైవ్‌కు వెళ్తుందనే అభిమానులు భావిస్తున్నారు. దివి కూడా అదరగొడుతోంది కానీ.. మ్యానిపులేట్ అవుతోందని.. మరి మున్ముందు ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఇంకా చాలా వీక్స్ ఉన్నాయి.. ఈ క్రమంలోనే పరిణామాలు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ సమయానికి వీరే ఉంటారా.? లేక వేరే కొత్తవాళ్లు యాడ్ అవుతారా.? అనేది వేచి చూడాలి.

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..