AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4 Telugu : కష్టపడకుండా కెప్టెన్ బట్ నో ఇమ్యునిటీ

బిగ్ బాస్ హౌస్‌లో టాస్కులు, డీల్స్ హద్దుమీరుతున్నట్లు అనిపిస్తున్నాయి. ఒంటిపై బట్టలు కట్ చేయడం, హెయిర్ కట్ చేయడం, అర గుండు చేసుకోవడం వంటివి కాస్త అతిగానే అనిపిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Bigg Boss 4 Telugu : కష్టపడకుండా కెప్టెన్ బట్ నో ఇమ్యునిటీ
Ram Naramaneni
|

Updated on: Oct 15, 2020 | 12:52 PM

Share

బిగ్ బాస్ హౌస్‌లో టాస్కులు, డీల్స్ హద్దుమీరుతున్నట్లు అనిపిస్తున్నాయి. ఒంటిపై బట్టలు కట్ చేయడం, హెయిర్ కట్ చేయడం, అర గుండు చేసుకోవడం వంటివి కాస్త అతిగానే అనిపిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక అమీ తుమీ టాస్క్‌లో గెలుపొందిన బ్లూ టీం  ‘కొట్టు తలతో ఢీ కొట్టు’ అనే టాస్క్  పాల్గొన్నారు. ఇందులో గెలిచిన వారం కెప్టెన్ అవుతారు. టాస్క్‌లో భాగంగా పోటీ దారులు  తలకి బ్యాట్ హెల్మెట్ ధరించి తమకు చెందిన తమకు కేటాయించిన కలర్ బాల్స్‌ని గోల్ నెట్‌లో వేయాల్సి ఉంటుంది. ఎవ‌రైతే ఎక్కువ వేస్తారో వాళ్లే విన్నర్స్ అవ్వడంతో పాటు నూతన కెప్టెన్‌గా బాధ్యతలు అందుకుంటారు. ఈ టాస్క్‌కు అవినాష్ సంచాల‌కుడిగా వ్యవహరించారు.

బ్లూ టీం సభ్యులు కుమార్ సాయి, రాజశేఖర్ మాస్టర్, అఖిల్, నోయల్, హారిక, దివిలు ‘కొట్టు తలతో ఢీ కొట్టు’ గేమ్‌లో తలపడ్డారు.  ఫైనల్‌గా ‌నోయ‌ల్ 16 బాల్స్ గోల్ చేయ‌డంతో అత‌ను రెండో సారి ఇంటి కెప్టెన్ అయ్యాడు. ఇంటి కెప్టెన్ అయిన‌వారు వ‌చ్చే వారు ఇమ్యునిటీ పొంది ఎలిమినేష‌న్ నుండి తప్పించుకోవచ్చు. కాని టాస్క్‌లో భాగంగా నోయ‌ల్ త‌న‌ని తాను నామినేట్ చేసుకోవడంతో అతడు సేఫ్ కాదని బిగ్ బాస్ చెప్పారు. తాను రెండోసారి కెప్టెన్ అవ్వడంతో నోయల్ పట్టరాని సంతోషంతో గెంతులేశాడు. ‘నాన్నా నీ కొడుకు కెప్టెన్ అయ్యాడు.. తొడకొట్టు నాన్నా..’ అంటూ కేకలుపెట్టాడు. టాస్కుల సమయంలో పెద్దగా కష్టపడని నోయల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు రావడంతో కొందరు పెదవి విరుసస్తున్నారు. టఫ్‌ టాస్కులు నిర్వర్తించిన హారిక, కుమార్ సాయిలలో ఒకరికి కెప్టెన్సీ అవకాశం వస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.  ఇక ఇంటి కెప్టెన్ అయిన నోయ‌ల్ రేష‌న్ మేనేజ‌ర్‌ని ఎంపిక చేశాడు. ఇందులో మోనాల్, మెహబూబ్‌లు పోటీ పడ్డారు. మెహ‌బూబ్ త‌న‌కు కెప్టెన్సీ టాస్క్‌లో హెల్ప్ చేసిన కార‌ణంగా అతనికి రేష‌న్ మేనేజ‌ర్ బాధ్య‌త‌లు అప్ప‌గించాడు నోయ‌ల్. ( జీహెచ్ఎంసీ కమిషనర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ )