బిగ్‌బాస్ షోలో సందడి చేసిన రాధే మా!
సుఖ్వీందర్ కౌర్ గుర్తున్నారా? ఇలా అంటే గుర్తుపట్టరేమోకానీ రాధే మా గుర్తున్నారా? ఇప్పుడా సన్యాసిని హిందీ బిగ్‌బాస్ షోలో పాల్గొన్నారు.. ఆశ్చర్యంగా ఉందా? నిజంగానే ఆమె బిగ్‌బాస్ 14లో సందడి చేశారు..
సుఖ్వీందర్ కౌర్ గుర్తున్నారా? ఇలా అంటే గుర్తుపట్టరేమోకానీ రాధే మా గుర్తున్నారా? ఇప్పుడా సన్యాసిని హిందీ బిగ్‌బాస్ షోలో పాల్గొన్నారు.. ఆశ్చర్యంగా ఉందా? నిజంగానే ఆమె బిగ్‌బాస్ 14లో సందడి చేశారు.. బిగ్‌బాస్ షోకు టీఆర్‌పీలు రావాలంటే ఇలాంటివి కావాలి కదా! అందుకే ఆమెను బతిమాలి బామాలి షోకు తీసుకొచ్చారు బిగ్‌బాస్ నిర్వాహకులు.. కాకపోతే అది కేవలం ప్రచారం కోసమేనండి.. రాధే మా కేవలం రెండు రోజులు మాత్రమే షోలో కనిపించారు. మొదటి రోజున గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్, అటు పిమ్మట బిగ్‌బాస్ హౌస్‌లో మొదటి రోజు మాత్రమే సన్యాసిని కనిపించారు.. ఆమె ఎందుకొచ్చారట అంటే బిగ్‌బాస్ షోలో పాల్గొంటున్నవారిని ఆశీర్వదించడానికట! ఏదైతేనేం రాధే మా బిగ్‌బాస్ హౌస్‌లో కనిపించడం మాత్రం ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది.. షో నిర్వాహకులకు కావల్సింది ఇదే కదా! అఖిల్ భారతీయ అఖాడ పరిషత్ మాత్రం రాధే మా బిగ్‌బాస్ షోలో కనిపించడాన్ని తీవ్రంగా గర్హించింది.. ఆమె సాధువు కాని, సన్యాసి కాని కాదని ఏబీఏపీ స్పష్టం చేసింది.. సాధువులు, సన్యాసులకు సంబంధించిన అత్యున్నత విభాగం అయిన ఏబీఏపీ అధ్యక్షుడు మహంత్ నరేంద్రగిరి బిగ్‌బాస్ షోలో రాధే మా రావడాన్ని తప్పుపట్టారు.. రాధే మాను సాధువులు, సన్యాసులతో అస్సలు కలపకూడదని, గాడ్ ఉమెన్‌గా తనకు తాను చెప్పుకునే ఆమెకు మతం, గ్రంథాల గురించి ఏ మాత్రం తెలియదని విమర్శించారు.. కాసినోలో పాటలు పాడటం, డాన్సలు చేయడం తప్ప ఆమెకు ఏమీ రాదని అన్నారు.. అసలు రాధే మానే పెద్ద వివాదాల పుట్ట! ఇలాంటి చర్యలతో ఎన్నోసార్లు ఆమె వార్తల్లో వ్యక్తి అయ్యారు.. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డోరంగల గ్రామంలో పుట్టిన సుఖ్వీందర్ కౌర్‌కు చిన్న వయసులోనే ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులయ్యారట! యుక్తవయసు వచ్చాక మోహన్‌సింగ్ అనే వ్యక్తితో పెళ్లి అయ్యింది..ఇల్లు గడవడం కోసం కొన్నాళ్లు టైలరింగ్ పని కూడా చేశారు.. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు..23 ఏళ్ల వయసులో మహంత్ రామ్ దీన్‌దాస్ శిష్యురాలిగా చేరారు.. సుఖ్వీందర్ కౌర్‌కు రాధే మా బిరుదు ఇచ్చింది ఆయనే! ఎప్పుడూ ఎరుపు రంగు దుస్తులు వేసుకునే రాధే మా చేతిలో త్రిశూలం మాత్రం కంపల్సరీ! రాధే మాకు బోలెడంత మంది శిష్యులున్నారు.. ఆమె ది లగ్జరీ లైఫ్.. తరచూ విదేశాలకు వెళ్లి వస్తుంటారు.. ఇక ఆమెపై బోలెడన్నీ కేసులు ఉన్నాయి.. నిజానికి రాధే మా 2015లోనే బిగ్‌బాస్-9లో పాల్గొనాల్సింది.. ఎందుకో అది వర్కవుట్ అవ్వలేదు..