అమ్మో ఎంత డబ్బో.. కోట్లల్లో నగదు.. కిలోల కొద్ది బంగారం
ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో కళ్లుచెదిరే నోట్లకట్టలు పట్టుబడ్డాయి. విజిలెన్సు అధికారులు నిర్వహించిన సోదాల్లో మొత్తం కోట్లాది రూపాయల నగదుతో పాటు పలు అక్రమ ఆస్తులు వెలుగుచూశాయి.
ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో కళ్లుచెదిరే నోట్లకట్టలు పట్టుబడ్డాయి. విజిలెన్సు అధికారులు నిర్వహించిన సోదాల్లో మొత్తం కోట్లాది రూపాయల నగదుతో పాటు పలు అక్రమ ఆస్తులు వెలుగుచూశాయి. తమిళనాడు లోని వెల్లూర్ జిల్లాలో వెల్లూర్ జిల్లా లో ప్రభుత్వ ఇంజనీర్ గా ఉన్న పన్నీరుసెల్వం .తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగం లోకి దిగిన విజిలెన్సు అధికారులు ఆ అధికారి ఇంట్లో సోదాలు చేపట్టారు. పన్నీరుసెల్వం ఇంట్లో సోదాలు నిర్వహించగా కోట్లల్లో నగదు , కిల్లోలెక్కన బంగారం , వెండి వస్తువులను గుర్తించినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రూ.3.5 కోట్ల నగదు, 4 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి , 90 చోట్ల కొనుగోలు చేసిన విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తులను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు.. పన్నీరుసెల్వం ని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నామని తెలిపారు. తమిళనాడు చరిత్రలోనే అత్యంత అవినీతి అధికారిని గుర్తించిన విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.