AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంతమందిని నవ్విస్తోన్న అవినాష్, సోహైల్‌ను ఏడిపించాడు

సోహైల్..గతంలో పలు సీరియల్స్, సినిమాల్లో నటించిన ఈ కుర్రాడు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు బాగా సుపరిచితుడయ్యాడు.

ఇంతమందిని నవ్విస్తోన్న అవినాష్, సోహైల్‌ను ఏడిపించాడు
Ram Naramaneni
|

Updated on: Oct 15, 2020 | 1:28 PM

Share

సోహైల్..గతంలో పలు సీరియల్స్, సినిమాల్లో నటించిన ఈ కుర్రాడు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు బాగా సుపరిచితుడయ్యాడు. ముఖ్యంగా అతడి పేరు చెప్పగానే షార్ట్ టెంపర్ గుర్తుకువస్తుంది. “కథ వేరే ఉంటది”…రెగ్యూలర్‌గా ఈ డైలాగ్‌తో ఎదుటి వ్యక్తులపైకి దూసుకెళ్తుంటాడు సోహైల్. వ్యక్తిగతంగా మంచోడే అయినా కోపం అతడికి అపకీర్తిని తెస్తుంది. అద్బుతంగా టాస్కులు ఆడతాడు..జనాలతో బాగా కలిసిపోతాడు. తేడా వస్తే మాత్రం కథ వేరే ఉంటది. అమ్మాయిలు , అబ్బాయిలు ఎవరైనా సరే దూసుకువెళ్తాడు. నాగార్జునతో పాటు హౌస్‌లో తోటి సభ్యులు పలుమార్లు చెప్పినా సోహైల్ తన ప్రవర్తనను మార్చుకోలేకపోతున్నాడు. కాగా ఎప్పుడూ స్ట్రాంగ్‌గా కనిపించే సోహైల్..అక్టోబర్ 14న ఎపిసోడ్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందుకు చాలా పెద్ద కారణమే ఉంది.‌

బుధవారం వరకు ఇంట్లో డీల్‌-నో డీల్‌ టాస్క్ కొనసాగింది. ఈ టాస్క్‌ల్లో భాగంగా కాస్త కఠినమైన టాస్క్‌లను ఇచ్చి బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులను పరీక్షించాడు. అందులో భాగంగా.. నిన్న పేడ టబ్‌లో బటన్స్‌ వెతికే డీల్‌ దివికి వచ్చింది. దీంతో టాస్క్‌‌లో భాగంగా దివి ధైర్యంగా ఆ పేడ తొట్టిలోకి దిగి 100 బటన్స్ కి గాను 93 బటన్స్‌ను దొరకబట్టింది. మరో టాస్క్‌లో భాగంగా అవినాష్‌ ముఖానికి లెగ్గింగ్ వేసుకుని అరటి పండు తిన్నాడు. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో అసలు మ్యాటరంతా అఖిల్ చేసిన టాస్క్‌లోనే ఉంది.  ఓ కుర్చిలో కదలకుండా బిగ్ బాస్ టాస్క్ కంప్లీట్ అని చెప్పేవరకు అఖిల్ కుర్చోవాలి.  అతడిని ఇతరులు బలవంతంగా లేపకూడదు. ఈ క్రమంలో అతడిని వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టారు. అఖిల్‌ కంట్లో షాంపూ పడటం గమనించిన మోనాల్‌ నీళ్లు పోయబోయింది.  మెహబూబ్‌, అభిజీత్ ఆమెను వారించారు. ఆ తర్వాత నోయల్‌ క్లాత్‌తో అఖిల్ కళ్లను తుడిచాడు. దానికి అవినాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అఖిల్‌ ఉన్నాడు కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు… అదే నేనో ఇంకెవరో కూర్చుంటే మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టేవారో అంటూ ‘సంచాలక్‌’గా చేస్తోన్న కెప్టెన్ సోహెల్‌ను ఉద్ధేశిస్తూ.. నువ్వు చేసేది కరెక్ట్‌ కాదు అన్నాడు. ( Bigg Boss 4 Telugu : కష్టపడకుండా కెప్టెన్ బట్ నో ఇమ్యునిటీ )

దీంతో సంచాలక్‌గా నిర్ణయాలు నా ఇష్టం అని సోహైల్‌ ఆన్సరిచ్చాడు. దానికి అవినాష్ ‘పొద్దున్నుంచి కడుపు కాల్చుకుని గేమ్స్‌ ఆడుతున్నాం.. మేము ఏమన్నా పిచ్చొళ్లమా’ అంటూ..తీవ్రస్థాయిలో ఫైరయ్యాడు. నన్ను సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నావ్‌ అంటారు. ఇది కాదా సేఫ్‌ గేమ్‌ అంటూ గట్టిగా కేకలు వేశాడు. ఒకరిని సపోర్టు చేసుకుంటూ, ఇంకొకరిని సపోర్టు చేయడం లేదని ఆరోపించాడు. అయితే ఆ మాటలకు మొదట కోపంతో ఊగిపోయిన సోహైల్ తర్వాత కన్నీరు పెట్టుకున్నాడు. నేను ఎంత సర్దుకుపోతున్నా.. నన్ను ఇలా అంటున్నారని వెక్కి వెక్కి ఏడ్చాడు. దీంతో అఖిల్‌ వచ్చి అతడికి సర్దిచెప్పాడు.