టాప్ 10 న్యూస్@10 AM
1.తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు.. తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ గత రెండు, మూడు రోజులగా ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచికొడుతున్నాయి. మరోవైపు వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం.. Read more 2. నేడు అధికారిక లాంఛనాలతో జైపాల్ అంత్యక్రియలు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి […]
1.తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు..
తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ గత రెండు, మూడు రోజులగా ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచికొడుతున్నాయి. మరోవైపు వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం.. Read more
2. నేడు అధికారిక లాంఛనాలతో జైపాల్ అంత్యక్రియలు
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని.. Read more
3. నవరత్నాల అమలు… గ్రామ సచివాలయాలతో నాంది!
నవరత్నాల అమలు గ్రామ సచివాలయాలతోనే ప్రారంభమవుతుందని, ఈ వ్యవస్థ సంపూర్ణంగా పనిచేసిన నాటినుంచే అసలైన ప్రభుత్వ పాలన మొదలవుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు.. Read more
4. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు పదమూడో రోజుకి చేరుకున్నాయి. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సభ్యులంతా చర్చించిన అనంతరం.. Read more
5. నేడు యడియూరప్పకు బల పరీక్ష.. రెబెల్స్‌పై వేటుతో లైన్ క్లియర్
కర్నాటక రాజకీయం మరో మలుపు తిరిగింది. ప్రస్తుతం అక్కడ బలపరీక్షల కాలం నడుస్తోంది. వారం క్రితమే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించారు. మళ్లీ వారం తిరగక ముందే మరోసారి పరీక్ష నిర్వహించబోతున్నారు. ఇవాళ.. Read more
6. భారత మత్సకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
భారతదేశానికి చెందిన ఏడుగురు మత్సకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం సమీపంలోని కచ్చాతీవు దీవి సమీపంలో మత్సకారులు చేపలు పడుతున్నారు. అయితే అదే సమయంలో.. Read more
7. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి.. 8 మందికి గాయాలు..
ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. న్యూ టిహరీ జిల్లాలోని నరేంద్ర నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు హరియాణాకు.. Read more
8. ఆఫ్ఘన్‌లో ఉపాధ్యక్ష అభ్యర్థి లక్ష్యంగా బాంబు దాడి.. ఇద్దరు మృతి
ఆఫ్ఘనిస్థాన్‌లో దుండగులు రెచ్చిపోయారు. ఉపాధ్యక్షుడిగా పోటీ చేయబోతున్న అమ్రుల్లా సలే లక్ష్యంగా బాంబుదాడులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఓ మహిళ సహా ఇద్దరు మృతి చెందగా.. మరో 25మంది.. Read more
9. ‘బౌండరీ కౌంట్’ వివాదం.. కుంబ్లే అధ్యక్షతన కమిటీ
2019 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో బౌండరీ కౌంట్ విధానం వివాదానికి దారి తీసింది. బౌండరీ విధానంతో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడంపై మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు తప్పుబట్టారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం దిశగా.. Read more
10. బిగ్‌బాస్ 3: ఎలిమినేట్ అయిన హేమ.. ఎంట్రీ ఇచ్చిన తమన్నా
తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ సీజన్-3 ఆసక్తికరంగా సాగుతోంది. ఈ షోలో తొలి ఎలిమినేషన్ జరిగింది. తొలి వారం వచ్చిన ఓట్ల ఆధారంగా నటి హేమ షో నుంచి ఎలిమినేట్ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. దీంతో హేమ.. Read more