కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి.. 8 మందికి గాయాలు..

ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. న్యూ టిహరీ జిల్లాలోని నరేంద్ర నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు హరియాణాకు చెందిన వారుగా స్థానికులు గుర్తించారు. కావడి యాత్రలో పాల్గొని రుషికేశ్‌లోని గంగోత్రిని దర్శించుకుని తిరిగి ఇళ్లకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతంలోని రోడ్డు పై వెళుతున్న సమయంలో వీరి వాహనంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా కొండచరియలు పడటంతో వాహనాలు నుజ్జునుజ్జుయ్యాయి. కాగా, గాయపడ్డ వారిని చికిత్స నిమిత్త సమీపంలోని ఎయిమ్స్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *