AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 1 PM

1.పాకిస్థాన్‌ డిఎన్‌ఏ లోనే “టెర్రరిజం” ఉంది: భారత్ ప్యారిస్‌లో జరుగుతున్న యునెస్కో సదస్సులో పాకిస్తాన్ లేవనెత్తిన కశ్మీర్‌ అంశానికి భారత్‌ ధీటైన సమాధానం ఇచ్చింది. ఉగ్రవాదం పాకిస్తాన్ డీఎన్‌ఏలోనే ఉందంటూ భారత ప్రతినిధి అనన్య అగర్వాల్‌ పాక్‌ ప్రతినిధులను ఏకిపారేశారు…Read more 2.ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్.. మా ఆదేశాలు పట్టించుకోరా..? ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలపై జాప్యం చేస్తోందంటూ మండిపడింది. పంచాయతీల కాల పరిమితి ముగిసినా.. […]

టాప్ 10 న్యూస్ @ 1 PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 15, 2019 | 12:58 PM

Share

1.పాకిస్థాన్‌ డిఎన్‌ఏ లోనే “టెర్రరిజం” ఉంది: భారత్

ప్యారిస్‌లో జరుగుతున్న యునెస్కో సదస్సులో పాకిస్తాన్ లేవనెత్తిన కశ్మీర్‌ అంశానికి భారత్‌ ధీటైన సమాధానం ఇచ్చింది. ఉగ్రవాదం పాకిస్తాన్ డీఎన్‌ఏలోనే ఉందంటూ భారత ప్రతినిధి అనన్య అగర్వాల్‌ పాక్‌ ప్రతినిధులను ఏకిపారేశారు…Read more

2.ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్.. మా ఆదేశాలు పట్టించుకోరా..?

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలపై జాప్యం చేస్తోందంటూ మండిపడింది. పంచాయతీల కాల పరిమితి ముగిసినా.. ఇంకా ఎన్నికలు నిర్వహించలేదంటూ…Read more

3.రేషన్‌ కార్డుకు అదనంగా 4 ముఖ్యమైన కొత్త కార్డులివే..!

ఏపీ ప్రభుత్వం.. మరో కొత్త ప్రతిపాదనను ప్రకటించింది. ఇన్నాళ్లూ.. ఒక కుటుంబానికి రేషన్‌ కార్డు ఆధారంగా.. వివిధ పథకాల ఫలాలు అందుతూ వచ్చేవి. కానీ.. ఇప్పుడు అందులో కూడా జగన్ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది…Read more

4.క్రికెట్‌కీ, పాలిటిక్స్‌కీ లింక్! ఏదైనా జరగొచ్చు: గడ్కరీ

మహారాష్ట్ర రాజకీయ భవిష్యత్తు గురించి వ్యాఖ్యానించడానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిరాకరించారు. “క్రికెట్ మరియు రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. కొన్నిసార్లు మీరు మ్యాచ్‌లో ఓడిపోతున్నారని భావిస్తారు, కాని ఫలితం…Read more

5.‘ మహా ‘ లో ఇక శివసేన ప్రభుత్వం ? కాంగ్రెస్, ఎన్సీపీలకూ భాగస్వామ్యం !

మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఏర్పడే దిశగా పరిణామాలు సాగుతున్నాయి. ఈ పార్టీ.. తన ప్రధాన డిమాండ్ అయిన పూర్తి స్థాయి సీఎం పదవిని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో సంకీర్ణ సర్కార్ ఏర్పాటు…Read more

6.వరుణ్ తల్లిగా శివగామి.. తండ్రిగా స్టార్ హీరో..?

ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ సినిమాలతో ఈ ఏడాది వరుస రెండు విజయాలను ఖాతాలో వేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జోరు మీదున్నాడు. ప్రస్తుతం ఈ హీరో కొత్త దర్శకుడు సాయి కొర్రపాటి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యాడు…Read more

7.ఆనాడు వైఎస్‌ తీర్చలేకపోయినా.. ఇప్పుడు జగన్ తీర్చాడు

ఆనాడు తాను వైఎస్‌ని అడిగిన కోరికను ఆయన తీర్చలేకపోయినా.. ఇప్పుడు జగన్ తీర్చాడని అన్నారు సీనియర్ నటుడు విజయ్ చందర్. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా గురువారం నాడు విజయ్ చందర్ బాధ్యతలు…Read more

8.వైసీపీవైపు ఎన్టీఆర్ చూపు..? వల్లభనేని ఏమన్నారంటే..!

వైసీపీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2009 ఎన్నికల ప్రచారానికి తాను, కొడాలి నాని ఇద్దరం కలిసి ఎన్టీఆర్‌ను ఒప్పించి తీసుకొచ్చామని…Read more

9.చంద్రబాబుపై వల్లభనేని సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే పలువురు పార్టీ సీనియర్లు కమలం గూటికి చేరగా.. తాజాగా.. పార్టీ ఎమ్మెల్యేలు కూడా జంపింగ్‌కు రెడీ అయ్యారు…Read more

10.‘అభిశంసన నా కుటుంబానికే దెబ్బ’.. ట్రంప్

తనను అభిశంసించాలంటూ డెమొక్రాట్లు చేస్తున్న ప్రయత్నాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పు పట్టారు. ఇది తనకే కాక, తన కుటుంబానికే దెబ్బ అన్నారు. లూసియానాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన…Read more