‘ మహా ‘ ఎపిసోడ్ : 25 ఏళ్ళ వరకూ మాదే ప్రభుత్వం.. సంజయ్ రౌత్

మహారాష్ట్రలో నూతన ప్రభుత్వాన్ని శివసేన ఏర్పాటు చేస్తుందని, సర్కార్ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిస్తుందని సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ కార్యక్రమం అవసరమన్నారు. రానున్న 25 ఏళ్ళ వరకూ ఉధ్ధవ్ థాక్రే నేతృత్వంలోని ప్రభుత్వమే పాలన కొనసాగిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అంతేతప్ప.. ఐదేళ్లు మాత్రమే కాదన్నారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపకల్పనపై తమ పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలతో చర్చలు జరుపుతున్నట్టు […]

' మహా ' ఎపిసోడ్ : 25 ఏళ్ళ వరకూ మాదే ప్రభుత్వం.. సంజయ్ రౌత్

మహారాష్ట్రలో నూతన ప్రభుత్వాన్ని శివసేన ఏర్పాటు చేస్తుందని, సర్కార్ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిస్తుందని సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ కార్యక్రమం అవసరమన్నారు. రానున్న 25 ఏళ్ళ వరకూ ఉధ్ధవ్ థాక్రే నేతృత్వంలోని ప్రభుత్వమే పాలన కొనసాగిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అంతేతప్ప.. ఐదేళ్లు మాత్రమే కాదన్నారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపకల్పనపై తమ పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలతో చర్చలు జరుపుతున్నట్టు సంజయ్ చెప్పారు. రాష్ట్రంలో ఏర్పడేది ఏకైక పార్టీ ప్రభుత్వమా లేక సంకీర్ణ ప్రభుత్వమా అన్నదానికన్నా సుపరిపాలనకు అజెండా అన్నది అవసరమని ఆయన పేర్కొన్నారు. కరువు, వర్షాలు, వరదలు వంటి అంశాలతో బాటు రైతులకు సంబంధించిన ప్రాజెక్టుల విషయాన్ని పరిశీలించాల్సి ఉందని అన్నారు. మా వద్దకు వస్తున్నవారు మంచి పాలనాదక్షులు.. వారి అనుభవం మాకెంతో తోడ్పడుతుంది అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీతో తమ సేన ‘ చెలిమి ‘ గురించి ప్రస్తావిస్తూ ఆయన.. దేశంలో అతి పెద్ద చరిత్ర కలిగిన ఆ పార్టీ ఈ దేశంతో బాటు , మహారాష్ట్రకు కూడా చేసిన కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. .