రోడ్డు ప్రమాదంలో మరాఠీ సింగర్ మృతి

మరాఠీ చిత్రాల నేపథ్య గాయని గీతామాలి రోడ్డు ప్రమాదంలో మరణించింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. తన భర్త విజయ్ తో కలిసి నాసిక్ లోని తమ ఇంటికి వస్తుండగా.. ముంబై-ఆగ్రా హైవేపై నిలిపి ఉంచిన కంటెయినర్ ను వీరి కారు ఢీ కొంది. ఈ యాక్సిడెంట్ లో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. షాపూర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గీతామాలి మరణించింది. అమెరికాలో రెండు నెలల పాటు ఉండి తమ సొంత […]

రోడ్డు ప్రమాదంలో మరాఠీ సింగర్ మృతి
Follow us
Anil kumar poka

|

Updated on: Nov 15, 2019 | 2:17 PM

మరాఠీ చిత్రాల నేపథ్య గాయని గీతామాలి రోడ్డు ప్రమాదంలో మరణించింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. తన భర్త విజయ్ తో కలిసి నాసిక్ లోని తమ ఇంటికి వస్తుండగా.. ముంబై-ఆగ్రా హైవేపై నిలిపి ఉంచిన కంటెయినర్ ను వీరి కారు ఢీ కొంది. ఈ యాక్సిడెంట్ లో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. షాపూర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గీతామాలి మరణించింది. అమెరికాలో రెండు నెలల పాటు ఉండి తమ సొంత రాష్ట్రానికి వస్తున్న గీతామాలి ఈ ప్రమాదంలో మరణించడం ముఖ్యంగా మరాఠీ చిత్ర పరిశ్రమను విషాదంలో నింపింది. పలు మ్యూజిక్ ఆల్బమ్ లను కూడా ఆమె రూపొందించింది.