స్కూళ్లలో ఇక ‘వాటర్ బెల్’ పిల్లలకు స్పెషల్ రూల్..!

నీరు తాగని కారణంగా.. పిల్లలు ఎక్కువగా డీ హైడ్రేషన్‌కి గురవుతూంటారు. ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అందులోనూ.. వారు ఎక్కువ సేపు స్కూళ్లల్లోనే ఉంటారు. దీంతో.. ఈ సమస్యకు కేరళ రాష్ట్రం ఓ సరికొత్త మార్గాన్ని పాటిస్తోంది. ఆ రాష్ట్రంలోని ఉన్న అన్ని స్కూళ్లలో.. ప్రతీ 3 గంటలకొకసారి.. ‘వాటర్ బెల్’ కొట్టే ఏర్పాటు చేసింది. ఆ సమయంలో.. స్టూడెంట్స్ నీరు తాగేలా.. టీచర్స్‌ పర్యవేక్షిస్తారు. దీంతో.. అటు స్కూల్ పిల్లల ఆరోగ్యంపై దృష్టి […]

  • Updated On - 7:29 am, Sat, 16 November 19 Edited By:
స్కూళ్లలో ఇక 'వాటర్ బెల్' పిల్లలకు స్పెషల్ రూల్..!

నీరు తాగని కారణంగా.. పిల్లలు ఎక్కువగా డీ హైడ్రేషన్‌కి గురవుతూంటారు. ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అందులోనూ.. వారు ఎక్కువ సేపు స్కూళ్లల్లోనే ఉంటారు. దీంతో.. ఈ సమస్యకు కేరళ రాష్ట్రం ఓ సరికొత్త మార్గాన్ని పాటిస్తోంది. ఆ రాష్ట్రంలోని ఉన్న అన్ని స్కూళ్లలో.. ప్రతీ 3 గంటలకొకసారి.. ‘వాటర్ బెల్’ కొట్టే ఏర్పాటు చేసింది. ఆ సమయంలో.. స్టూడెంట్స్ నీరు తాగేలా.. టీచర్స్‌ పర్యవేక్షిస్తారు. దీంతో.. అటు స్కూల్ పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టినట్టు అవుతుంది.

కాగా.. మనిషికి ముఖ్యంగా.. నీరు, గాలి, ఆహారం ముఖ్యం. వీటిల్లో ఏది తక్కువైనా సరే.. అనారోగ్యం బారిన పడక తప్పదు. అంతేకాకుండా.. రోజుకు కనీసం.. 8 గ్లాసుల మంచినీటినైనా తాగమని చెబుతూంటారు డాక్టర్లు. ఎందుకంటే.. నీరు.. దేహంలోని.. మలినాలను శుభ్రపరుస్తుంది. అందులోనూ.. ముఖ్యంగా.. చిన్న పిల్లలకు.. విద్యార్థులకు నీరు ఎక్కువగా అవసరమవుతుంది. ముఖ్యంగా విద్యార్థులు స్కూళ్లల్లో నీటిని తాగేందుకు ఆసక్తిని చూపరు. తల్లితండ్రులు మంచినీటి బాటిల్స్‌తో.. స్కూల్‌కి పంపినా.. వారు తాగరు. అడిగితే.. సమయం కుదరలేదని సాకులు చెబుతూంటారు.

ఈ ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని తమిళనాడులోని పాఠశాలల్లో కూడా పాటిస్తున్నారు. ప్రతీ పీరియడ్‌కు  మధ్య పది నిమిషాల సమయం కేటాయిస్తున్నట్లు.. తమిళనాడు విద్యాశాఖ మంత్రి కేఏ సెంగొట్టయాన్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ వార్త కాస్తా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు ఇదే.. రూల్‌ని అన్ని విద్యాస్థంస్థలు పాటించనున్నాయి.

ఏపీలోనూ అమలు..

కేరళ ప్రభుత్వం చేపట్టిన వినూత్న ఐడియా స్పూర్తితో.. కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉమ్మర్ అరబిక్‌ పాఠశాల యాజమాన్యం కూడా ఈ విధానాన్ని పాటిస్తోంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ.. ఈ పాఠశాల ప్రిన్సిపల్ దీన్ని ప్రారంభించారు.