Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

ఆనాడు వైఎస్‌ తీర్చలేకపోయినా.. ఇప్పుడు జగన్ తీర్చాడు

Vijay Chander interesting comments on YS Jagan, ఆనాడు వైఎస్‌ తీర్చలేకపోయినా.. ఇప్పుడు జగన్ తీర్చాడు

ఆనాడు తాను వైఎస్‌ని అడిగిన కోరికను ఆయన తీర్చలేకపోయినా.. ఇప్పుడు జగన్ తీర్చాడని అన్నారు సీనియర్ నటుడు విజయ్ చందర్. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా గురువారం నాడు విజయ్ చందర్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయనను కలిసిన ప్రతిసారి ఆప్యాయతగా పిలిచేవారని, యోగక్షేమాలు అడిగి తెలుసుకునే వారని అన్నారు. ఇక ఎఫ్‌డీసీ ఛైర్మన్ కావాలని ఇరవై ఏళ్ల క్రితమే తాను వైఎస్‌ని అడిగానని.. అయితే అనివార్య కారణాల వలన ఆయన ఇవ్వలేకపోయారని అన్నారు. ఇప్పుడు జగన్ ద్వారా నా కల నెరవేరిందని.. వైఎస్సార్ ఆత్మే జగన్ అని ప్రశంసలు కురిపించారు.

అనంతరం తెలుగు చిత్రసీమను ఉద్దేశించి మాట్లాడిన విజయ్ చందర్.. హైదరాబాద్‌లో ఉన్న సినీ ప్రముఖులు, ఆంధ్ర రాష్ట్ర ప్రముఖులు మాతృభూమి అభివృద్ధికి తోడ్పాటు అందించారని అన్నారు. ఇకనుంచి ప్రతిభ, టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు ఇస్తానని.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా సినీ పరిశ్రమ పని చేస్తుందని తెలిపారు. ఇక నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్‌లో స్థిరపడిన ప్రముఖులు తోడ్పాటును అందించాలని కోరారు. ఏపీ ఫిల్మ్ స్టూడియోకు ముఖ్యమంత్రి జగన్ ఆలోచన చేస్తారని.. 4 సంవత్సరాలలో విజయం సాధించి తీరుతామని విజయ్ చందర్ చెప్పుకొచ్చారు. సీఎం తనపై పెట్టిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు