వైసీపీవైపు ఎన్టీఆర్ చూపు..? వల్లభనేని ఏమన్నారంటే..!

వైసీపీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2009 ఎన్నికల ప్రచారానికి తాను, కొడాలి నాని ఇద్దరం కలిసి ఎన్టీఆర్‌ను ఒప్పించి తీసుకొచ్చామని చెప్పిన ఆయన.. ఎన్నికల ఫలితాల తరువాత ఎన్టీఆర్‌పై చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆత్మాభిమానం అడ్డొచ్చి ఎన్టీఆర్ ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారని తెలిపారు. ఇక అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా వెళ్తారని.. 2014 […]

వైసీపీవైపు ఎన్టీఆర్ చూపు..? వల్లభనేని ఏమన్నారంటే..!
Follow us

| Edited By:

Updated on: Nov 15, 2019 | 7:47 AM

వైసీపీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2009 ఎన్నికల ప్రచారానికి తాను, కొడాలి నాని ఇద్దరం కలిసి ఎన్టీఆర్‌ను ఒప్పించి తీసుకొచ్చామని చెప్పిన ఆయన.. ఎన్నికల ఫలితాల తరువాత ఎన్టీఆర్‌పై చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆత్మాభిమానం అడ్డొచ్చి ఎన్టీఆర్ ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారని తెలిపారు. ఇక అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా వెళ్తారని.. 2014 ఎన్నికల్లో ఈయనే పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లారని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు సన్నిహితులుగా ఉండే కొడాలి నాని ఇప్పటికే వైసీపీలో ఉండగా.. మీరు(వల్లభనేనిని ఉద్దేశించి)ఇకపై ఆ పార్టీలోకి వెళ్లబోతున్నారు. అంటే త్వరలో ఎన్టీఆర్‌ను కూడా వైసీలోకి తీసుకెళ్తారా..? అని అడిగిన ప్రశ్నకు వల్లభనేని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడని.. భవిష్యత్‌ను తాను చెప్పలేనంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటోన్న ఎన్టీఆర్ టీడీపీ వ్యతిరేకంగా ఉండే మిగిలిన పార్టీల వైపు చూస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో అతడు వైసీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా..? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అవన్నీ ఎన్టీఆర్ అంటే గిట్టని వారు చేసిన ప్రచారాలని.. తనకు తెలిసి ఎన్టీఆర్ అలాంటి వాడు కాదని పేర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ గురించి ఈ వెర్షన్‌ కూడా తాను వినలేదని వల్లభనేని చెప్పుకొచ్చారు.