ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్.. మా ఆదేశాలు పట్టించుకోరా..?

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలపై జాప్యం చేస్తోందంటూ మండిపడింది. పంచాయతీల కాల పరిమితి ముగిసినా.. ఇంకా ఎన్నికలు నిర్వహించలేదంటూ.. అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ఆదేశాలిచ్చి 13 నెలలు పూర్తైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని.. ఎన్నికలు నిర్వహించకపోవడం, హైకోర్టు ఉత్తర్వులు పాటించకపోవడం.. రాజ్యంగ నిబంధనలను ఉల్లఘించడమేనంటూ.. వ్యాఖ్యానించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన అధికారాన్ని ఎందుకు వినియోగించుకోలేదో.. దానికి […]

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్.. మా ఆదేశాలు పట్టించుకోరా..?
Follow us

| Edited By:

Updated on: Nov 15, 2019 | 12:32 PM

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలపై జాప్యం చేస్తోందంటూ మండిపడింది. పంచాయతీల కాల పరిమితి ముగిసినా.. ఇంకా ఎన్నికలు నిర్వహించలేదంటూ.. అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ఆదేశాలిచ్చి 13 నెలలు పూర్తైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని.. ఎన్నికలు నిర్వహించకపోవడం, హైకోర్టు ఉత్తర్వులు పాటించకపోవడం.. రాజ్యంగ నిబంధనలను ఉల్లఘించడమేనంటూ.. వ్యాఖ్యానించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన అధికారాన్ని ఎందుకు వినియోగించుకోలేదో.. దానికి సంబంధించి.. కోర్టు ఆదేశాలను అధికారులు ఎందుకు పట్టించుకోలేదో.. తెలియడంలేదని పేర్కొంది.

ఏపీలో 12వేల 775 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి.. ఆదేశాలు జారీ చేయాలంటూ.. తాండవ యేగేష్ అనే లాయర్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడు. ఇందుకు సంబంధించి విచారణ జరిపిన.. హైకోర్టు.. రాష్ట్రఎన్నికల కమిషన్‌పై కూడా అసహనం వ్యక్తం చేసింది. వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్‌ను ఆదేశించింది. అనంతరం.. రాష్ట్రంలో విపత్తుల వల్లే ఎన్నికలు నిర్వహించలేకపోయామని ప్రభుత్వం తరపు న్యాయవాది.. హైకోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం ఏర్పడ్డాక.. గ్రామ సచివాలయాల ఏర్పాటు.. ఉద్యోగాల భర్తీ కారణంగా.. ఎన్నికలు నిర్వహించలేకపోయామని ఆయన కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?