Ayurveda – Curd Benefits: వీటిని పెరుగుతో కలిపి తీసుకుంటే మీ ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు..

Ayurveda: పాల నుంచి వచ్చే పదార్ధాల్లో ఒకటి పెరుగు. ఇది ఒక మంచి ఆహార పదార్ధం.. మరిగించిన పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం మజ్జిగ చుక్కను వేస్తే పాలు....

Ayurveda - Curd Benefits: వీటిని పెరుగుతో కలిపి తీసుకుంటే మీ ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు..
Curd
Follow us
Surya Kala

|

Updated on: Jun 18, 2021 | 6:24 PM

Ayurveda: పాల నుంచి వచ్చే పదార్ధాల్లో ఒకటి పెరుగు. ఇది ఒక మంచి ఆహార పదార్ధం.. మరిగించిన పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం మజ్జిగ చుక్కను వేస్తే పాలు గట్టిగా తోడుకొంటాయి. దీనినే పెరుగు అంటారు. పెరుగు నుండి వెన్న, నెయ్యి, మీగడ లను తీస్తారు.పెరుగు ఎలాంటి వాత వ్యాధినయినా నయం చేస్తుంది. అంతేకాదు బరువును పెంచుతుంది, శరీరానికి పుష్టిని కలిగిస్తుంది. అయితే ఈ పెరుగుని ఎంత మంచి ఇష్టంగా తినే వాళ్ళు ఉన్నారో .. అదే విధంగా పెరుగుని ఇష్టపడని వారు కూడా అంతేమంది ఉన్నారు. ఆహారం మీద యిష్టం లేని వాళ్ళకి పెరుగు మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. అయితే ఈ ఆయుర్వేదంలో పెరుగుని వాము, తేనే, ఇలా వివిధ పదార్ధాలతో కలిపి తింటే అనేక వ్యాధులను తగ్గిస్తుందని చెబుతుంది. ఈరోజు పెరుగుని ఏయే పదర్శలతో కలిపి తింటే ఏయే ఆరోగ్య ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం

*పెరుగు తింటే బరువు పెరుగుతారని భపడేవారు అందుకో కొంచెం జీల‌క‌ర్ర‌ పొడి వేసుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. * జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడే వారు కొద్దిగా న‌ల్ల ఉప్పు పొడిని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి. * కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తింటే శరీరానికి తక్షణ శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు తగ్గుతాయి. *. దంత సమస్యలు, నోటి పూతతో ఇబ్బడి పడేవారు ఓ కప్పు పెరుగులో కొంచెం వాము వేసుకుని తింటే దంత సమస్యలు తీరిపోతాయి. *ఆహారం జీర్ణం కానివారు ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని కలిపి తింటే వెంటనే ఆహారం జీర్ణం అవుతుంది. * పెరుగులో ఓట్స్ క‌లిపి తింటే మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి. *పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. *పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తింటే ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. *పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తీసుకుంటే విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది. * పెరుగు తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స‌ర్ తగ్గుతుంది. అంతేకాదు పెరుగు తేనే మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే తగ్గుతాయి.

Also Read: అరేబియా సముద్రంలో రహస్య దీవి ప్రత్యక్షం.. అధ్యయనం కోసం రంగంలోకి దిగిన శాస్త్రజ్ఞులు

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?