నాయిని అంత్యక్రియల్లో జేబు దొంగల చేతివాటం
తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి మరణంతో కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు తీవ్ర విషాాదంలో మునిగిపోయారు.

తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి మరణంతో కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ అభిమాన నేత ఇక లేడన్న వార్తను టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ప్రియతమ నేతను కొల్పోయామన్న బాధలో పలువురు కార్యకర్తలు ఉండగా… దీన్ని అవకాశంగా తీసుకున్న జేబు దొంగలు రెచ్చిపోయారు. నాయిని అంతక్రియలకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకుల పర్సులను ఓ దొంగల ముఠా తస్కరించింది. పలువురు ప్రముఖులు కూడా బాధితుల లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఓ నేత జేబులో నుంచి నగదును తీస్తుండగా ముఠాలోని ఓ సభ్యుడు దొరికిపోయాడడు. దీంతో సదరు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ముఠాలోని ఇతరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియలు నగరంలోని మహా ప్రస్థానం స్మశానవాటికలో ముగిశాయి. అంత్యక్రియల్లో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్ని కార్మిక నేతకు అంతిమ వీడ్కోలు పలికారు.
Also Read :
“వాడి పొగరు ఎగిరే జెండా”, అంచనాలకు మించిన తారక్ టీజర్




