సోషల్ మీడియాలోకి శింబు గ్రాండ్ రీ-ఎంట్రీ!
తమిళ స్టార్ హీరో శింబు సామాజిక మాధ్యమాలలోకి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. ట్విటర్, ఫేస్‌బుక్ నుంచి 2017లో శింబు గుడ్ బైై చెప్పాడు.
తమిళ స్టార్ హీరో శింబు సామాజిక మాధ్యమాలలోకి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. ట్విటర్, ఫేస్‌బుక్ నుంచి 2017లో శింబు గుడ్ బైై చెప్పాడు. నెగిటివిటీ పెరిగిపోతోందనే కారణంతో అప్పట్లో సామాజిక మాధ్యమాలకు దూరమయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు పున: ప్రవేశం చేశాడు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను తిరిగి షురూ చేశారు. గత కొన్ని నెలలుగా చేసిన వర్కవుట్లకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో అతడి అభిమానులను ఆకట్టుకుంటోంది. తమిళనాడు యూత్‌లో శింబు అంటే మంచి క్రేజ్ ఉంది. తమ అభిమాన హీరో సోషల్ మీడియాలోకి రీ-ఎంట్రీ ఇవ్వడంతో వారంతా మంచి జోష్‌లో ఉన్నారు.
ఇక శింబు-త్రిషల పెళ్లి వార్త ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని వారిద్దరూ ఖండించడం లేదు. దీంతో వీరు దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారన్న వార్తలకు బలం చేకూరుతుంది.
Atman-SilambarasanTR#Atman #SilambarasanTR #STR pic.twitter.com/6TY4kujAOr
— Silambarasan TR (@SilambarasanTR_) October 22, 2020