కోవిడ్ వ్యాక్సీన్ ని ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటారా ? రాహుల్ గాంధీ

కోవిడ్ వ్యాక్సీన్ ని ఉచితంగా ఇస్తామని బీహారీలకు బీజేపీ ఇచ్చిన హామీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రాణ రక్షణ మందులను బాహాటంగా ఎన్నికలకు ముడిపెట్టడానికి ఆ పార్టీ యత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే కోవిడ్ యాక్సిస్ స్ట్రాటిజీని ప్రకటించిందని, ‘దయచేసి’ రాష్ట్రాల వారీ ఎలెక్షన్ షెడ్యూల్ ని పరిశీలించాలని ట్వీట్ చేశారు. దీనివల్ల అసలు వ్యాక్సీన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలుస్తుందన్నారు. అలాగే తప్పుడు హామీల వెల్లువ పస కూడా తేలుతుందని రాహుల్ […]

కోవిడ్ వ్యాక్సీన్ ని ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటారా ? రాహుల్ గాంధీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 22, 2020 | 5:48 PM

కోవిడ్ వ్యాక్సీన్ ని ఉచితంగా ఇస్తామని బీహారీలకు బీజేపీ ఇచ్చిన హామీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రాణ రక్షణ మందులను బాహాటంగా ఎన్నికలకు ముడిపెట్టడానికి ఆ పార్టీ యత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే కోవిడ్ యాక్సిస్ స్ట్రాటిజీని ప్రకటించిందని, ‘దయచేసి’ రాష్ట్రాల వారీ ఎలెక్షన్ షెడ్యూల్ ని పరిశీలించాలని ట్వీట్ చేశారు. దీనివల్ల అసలు వ్యాక్సీన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలుస్తుందన్నారు. అలాగే తప్పుడు హామీల వెల్లువ పస కూడా తేలుతుందని రాహుల్ పేర్కొన్నారు.  బీహార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న ఈ హామీ వివాదాస్పదమవుతోంది.