AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో ఉండాల్సిన పిల్లలు కనిపించలేదని.. ఊరంతా వెతికారు.. చివరకు ఏమైందంటే..?

సంకలో పిల్లలను పెట్టుకుని ఊరంతా వెతికారని ఓ సామెత గుర్తుందా..? ఇందుకు తగ్గట్టుగా ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. ఆరెంపుల గ్రామానికి చెందిన జంగం సురేశ్‌ కుమారుడు అలాగే ఆయ‌న ఇంటికి వచ్చిన సోదరి కుమారుడు ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో కుటుంబసభ్యులు ఇంటి ముందటికి వచ్చిన చిరు వ్యాపారి దగ్గర బేరం చేసుకుని పనిలో నిమగ్నమయ్యారు.

ఇంట్లో ఉండాల్సిన పిల్లలు కనిపించలేదని.. ఊరంతా వెతికారు.. చివరకు ఏమైందంటే..?
, Children Safe At Home
N Narayana Rao
| Edited By: |

Updated on: Dec 22, 2025 | 12:24 PM

Share

సంకలో పిల్లను పెట్టుకుని ఊరంతా వెతికారంట.. ఈ సామెత గుర్తుందా..? ఇలాంటిదే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెంపుల గ్రామానికి చెందిన జంగం సురేశ్‌ కుమారుడు కనిపించకుండాపోయాడు. ఆ బాలుడితోపాటు సురేశ్ ఇంటికి వచ్చిన సోదరి కొడుకు ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించలేదు. దీంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు ఊరంతా వెతికారు. అయితే కుటుంబసభ్యులు ఇంటి ముందటికి వచ్చిన చిరు వ్యాపారితో బేరం చేస్తుండగా వారితోపాటు ఉన్న ఇద్దరు చిన్నారులు మెల్లగా జారకుని ఇంట్లోకి వెళ్లిపోయారు.

ఇది గమనించని కుటుంబసభ్యులు బేరంలో మునిగిపోయారు. కొద్దిసేపటికి అప్పటి వరకు అక్కడే ఆడుకుంటున్న పిల్లలు కనిపించకపోయేసరికి కంగారుపడ్డారు. దీంతో ఇంటికి తాళం వేసిన చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఎంతకీ వాకి జాడ దొరక్కపోయేసరికి ఊరులో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ప్రధాన రహదారులు, ఊరి బయట చెరువు, కాలువల్లో వెత‌క‌డం ప్రారంభించారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వాట్సాప్‌ గ్రూపుల్లో చిన్నారుల ఫొటోలు అప్‌లోడ్ చేసి మిస్సయిన పిల్లల వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

దాదాపు నాలుగు గంటల పాటు అటు సోషల్ మీడియాలో, ఇటు గ్రామంలో, శివారు ప్రాంతాల్లో పిల్లల కోసం వెతికారు. చివరకు పిల్లల మిస్సింగ్‌పై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే కొందరు గ్రామస్తులు ఇచ్చిన సలహా మేరకు తాళం తీసి ఇంట్లో చూడగా పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటూ కనిపించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేశారు. ఇంట్లో పిల్లలను పెట్టుకుని ఊరంతా ఒక్కటి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..