Black Fungus: బ్లాక్ ఫంగస్ సోకిందేమోనన్న భయంతో.. వృద్ధుడు బలవన్మరణం.. పుట్టినరోజు నాడే..
80-year-old man suicide - Black Fungus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. దీంతో నిత్యం లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో మరో బ్లాక్ ఫంగస్ మహమ్మారి చాపకింద
Old man suicide – Black Fungus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. దీంతో నిత్యం లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో మరో బ్లాక్ ఫంగస్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా నుంచి కోలకున్న వారికే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, యల్లో ఫంగస్ వ్యాపిస్తోందంటూ వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో కొవిడ్-19 నుంచి కోలుకుంటున్న 80 ఏండ్ల వృద్ధుడు బ్లాక్ ఫంగస్ సోకిందనే భయంతో విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది. నగరంలోని పల్ది ప్రాంతంలో అమన్ అపార్ట్ మెంట్స్ లో నివసించే నిరంజన్ పటేల్ (80) తన శరీరంపై తెల్ల మచ్చలు, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించాడు. అనంతరం అవి బ్లాక్ ఫంగస్ అన్న అనుమానంతో భయపడ్డాడు. ఈ క్రమంలో మే 27న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యుులు వెల్లడించారు. అదే రోజు అతని పుట్టినరోజు అని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
బ్లాక్ ఫంగస్ వల్లే తన శరీరంపై మచ్చలు వచ్చాయనే భయంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోని ఉండవచ్చిని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవలనే కరోనా వైరస్ నుంచి కోలుకున్న పటేల్ మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఈ మచ్చలు బ్లాక్ ఫంగస్ అనే అనుమానం కలిగిందని.. దాని ప్రమాదం నుంచి ఇక తప్పించుకోలేనని భయపడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్ధానిక ఎస్ఐ జేఎం సోలంకి వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనట్లు పోలీసులు తెలిపారు.
Also Read: