AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INTER ADMISSIONS: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫస్ట్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులు

కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు గాలిపడుతున్నాయి. ఇంత కాలం మూత పడ్డ విద్యాసంస్థలను తిరిగి తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

INTER ADMISSIONS: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫస్ట్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులు
Balaraju Goud
|

Updated on: May 26, 2021 | 6:42 AM

Share

Telangana Intermediate Admission Schedule: కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు గాలిపడుతున్నాయి. ఇంత కాలం మూత పడ్డ విద్యాసంస్థలను తిరిగి తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదే క్రమంలో 2021-22 సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదలచేసింది. జూన్‌ ఒకటో తేదీ నుంచే ఫస్టియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ మంగళవారం ప్రకటన విడుదలచేశారు. మొదటి విడుత ఫస్టియర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలు మంగళవారం నుంచే ప్రారంభిం చినట్టు వెల్లడించారు. అయితే కోవిడ్ నిబంధనలకు లోబడి ఈ విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ జూలై 5వ తేదీతో ముగుస్తుంది. ఇది మొదటి విడుత ప్రవేశాల షెడ్యూల్‌ మాత్రమే నని, పరిస్థితిని బట్టి రెండో విడుత ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఎస్‌ఎస్‌సీ విద్యార్థుల ఇంటర్నెట్‌ మెమోల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ఇప్పటికే అయా జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఎస్‌ఎస్‌సీ ఒరిజినల్‌ మెమోలు, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లు సమర్పించిన తర్వాతే ప్రొవిజినల్‌ అడ్మిషన్లను ఆమోదిస్తామని స్పష్టంచేశారు. ఇతర వివరాల కోసం TSBIE/ acadtsbie. cgg. gov.in / tsbie.cgg.gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలని సూచించారు.

ప్రతి విద్యా సంవత్సం జూన్‌ మాసంలో మొదలవుతుంది. ఏటా జూన్ మొదటి వారం నుంచే ఇంటర్‌ కాలేజీలు ప్రారంభవుతుండగా, గతేడాది కరోనా నేపథ్యంలో సెప్టెంబర్‌ నుంచి ఆన్‌లైన్‌ క్లాసులను ప్రారంభించారు. ఈ ఏడాది విద్యార్థులు నష్టపోకుండా జూన్‌ 1 నుంచే ఆన్‌లైన్‌ క్లాసులతోపాటు, మంగళవారం నుంచే ప్రవేశాలు మొదలు కానున్నాయి. సెకండియర్‌ ఆన్‌లైన్‌ క్లాసులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పరిస్థితిని బట్టి ప్రారంభిస్తామని జలీల్‌ వెల్లడించారు. టెన్త్‌ పాసైన విద్యార్థులు ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు, కో ఆపరేటివ్‌, తెలంగాణ రెసిడెన్షియల్‌, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌, ఇంటెన్సివ్‌, మైనార్టీ గురుకులాలు, కేజీబీవీలు, టీఎస్‌ మోడల్‌ జూనియర్‌ కాలేజీలు, కాంపొజిట్‌ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇందుకు కీలక మార్గదర్శకాలను రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది.

జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు మార్గదర్శకాలు..

  • ప్రవేశాల్లో రిజర్వేషన్లను కచ్చితంగా పాటించాలి.
  • ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 29%, వికలాంగులకు 3%, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు 5%, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటాలో 3% చొప్పున సీట్లను భర్తీ.
  • బాలికలకు ప్రత్యేక కాలేజీ లేని పక్షంలో 33.33% లేదా 1/3 సీట్లను వారికి కేటాయించేలా ప్రిన్సిపాల్‌కు ఆదేశాలు.
  • ఎస్‌ఎస్‌సీ జీపీఏ ఆధారంగానే ప్రవేశాలు.
  • జూనియర్ కాలేజీలు ఎలాంటి ప్రవేశ పరీక్షలను నిర్వహించరాదు. ఒక వేళ నిర్వహిస్తే సదరు కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటారు.
  • ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలన్నింటిలో ప్రవేశాలు పొందే విద్యార్థులు తమ ఆధార్‌ నంబర్‌ను సమర్పించాలి.
  • ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు తమకు మంజూరైన సీట్లకు మించి ప్రవేశాలు కల్పించరాదు.
  • ఒక్కో సెక్షన్‌కు 88 మంది విద్యార్థులకు మించకుండా చూసుకోవాలి.
  • అంతేకాకుండా అదనపు సెక్షన్లు మంజూరైన తర్వాతే విద్యార్థులను చేర్చుకోవాలి.
  • బోర్డు ఉపసంహరించుకున్న కోర్సు కాంబినేషన్లలో అడ్మిషన్లు తీసుకోరాదు.
  • ప్రవేశాల సమయంలో కాలేజీలు తమకు మంజూరైన సెక్షన్లు, ఒక్కో సెక్షన్‌లో ఖాళీగా ఉన్న సీట్ల సంఖ్యను ప్రదర్శించడంతోపాటు, రోజువారీగా ఖాళీ సీట్ల సంఖ్యను అప్‌డేట్‌ చేయాలి.
  • జోగినిల పిల్లలకు ప్రవేశాలు కల్పించేటప్పుడు తండ్రి పేరు స్థానంలో తల్లిపేరు రికార్డుల్లో ఉంటే అదే పేరును కొనసాగించవచ్చు.
  • విద్యార్థులు ఆలస్యంగా ప్రవేశాలు తీసుకుంటే ఆయా వ్యవధికిగాను తహసిల్దార్‌ నుంచి లోకల్‌ క్యాండిడేట్‌/ రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ ఫర్‌ గ్యాప్‌ను సమర్పించాలి.

Read Also… Covaxin Second Dose: నేటినుంచి కొవాగ్జిన్‌ రెండో డోసు..రెండు రోజుల్లో 90వేల మందికి టీకా వేస్తామన్న సింఘాల్‌