కోవిడ్ వ్యాక్సిన్ పట్ల అపోహలు వద్దు.. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలిః గవర్నర్ తమిళసై
కోవిడ్ వ్యాక్సినేషన్‌పై అపోహలు విడనాడి... ధైర్యంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని గవర్నర్ పిలుపు.
Governor on Covid vaccination : ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ అత్యంత వేగంగా కొనసాగుతుంది. కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ మన దేశ శాస్త్రవేత్తలు అందుబాటులోకి తేవటం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలిపారు. ఆమె తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళసై మాట్లాడుతూ కొవిడ్ వ్యాక్సిన్ పట్ల అపోహలు వద్దన్నారు. కరోనా వైరస్‌ను స్వదేశంలో తయారైన వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. దేశాన్ని వణికిస్తున్న కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు మన దేశ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం విశేషంగా కృషీ చేశారన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌పై అపోహలు విడనాడి… ధైర్యంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకొని కోవిడ్ నుండి రక్షణ పొంది ఆరోగ్యంగా ఉండాలని తమిళసై ఆకాంక్షించారు.
అనంతకు ముందు గవర్నర్ తమిళసై కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శంచుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని, శ్రీకాళహస్తిశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికి అశీర్వచనం చేశారు.
ఇదీ చదవండి… ఆయోధ్య రామ మందిర నిర్మాణాకి కదిలిన పాతబస్తీ.. విరాళాలు సేకరించిన ముస్లిం మహిళలు