ఆ నలుగురిపై వెంకయ్యనాయుడుకు టీడీపీ ఎంపీల ఫిర్యాదు
నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీమారడంపై టీడీపీ ఎంపీలు నలుగురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్,తోట రామలక్ష్మి, గల్లా జయదేవ్,కేశినేనిలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కనకమేడల మాట్లాడుతూ టీడీపీని బీజేపీలో విలీనం చేసే అధికారం ఛైర్మన్ పరిధిలో ఉండదని, ఈ అంశం ఎన్నికల సంఘం పరిధిలో మాత్రమే ఉంటుందన్నారు. రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఎట్టిపరిస్థితిలోనూ చెల్లదని ఎంపీలు తెలిపారు. పార్టీ మారిన […]
నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీమారడంపై టీడీపీ ఎంపీలు నలుగురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్,తోట రామలక్ష్మి, గల్లా జయదేవ్,కేశినేనిలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా కనకమేడల మాట్లాడుతూ టీడీపీని బీజేపీలో విలీనం చేసే అధికారం ఛైర్మన్ పరిధిలో ఉండదని, ఈ అంశం ఎన్నికల సంఘం పరిధిలో మాత్రమే ఉంటుందన్నారు. రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఎట్టిపరిస్థితిలోనూ చెల్లదని ఎంపీలు తెలిపారు.
పార్టీ మారిన సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ వెంకటేశ్ లను ఫిరాయింపుదారులుగా గుర్తించాలని వెంకయ్యకు ఎంపీలు ఫిర్యాదు చేశారు. అలాగే నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కూడా విఙ్ఞప్తి చేశారు.