రాజకీయాల్లోకి తలపతి విజయ్..!

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తమిళనాట రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఇక ఈ సారి పోరులో సినిమా వాళ్లు ఎక్కువగా పాల్గొనబోయే

రాజకీయాల్లోకి తలపతి విజయ్..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 24, 2020 | 11:44 AM

Talapathy Vijay Politics: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తమిళనాట రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఇక ఈ సారి పోరులో సినిమా వాళ్లు ఎక్కువగా పాల్గొనబోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీలను ప్రకటించిన రజనీకాంత్‌, కమల్‌లు ఈ ఎన్నికల్లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీ కోలీవుడ్‌లోని పలువురిని తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. మరోవైపు అక్కడి ప్రాంతీయ పార్టీలు సైతం తమ కేడర్‌ని ఎక్కడకు పోకుండా కాపాడుకునే పనిలో పడ్డాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు మరో ఆసక్తికర వార్త తమిళనాట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే కోలీవుడ్ టాప్ హీరో తలపతి విజయ్ రాజకీయాల్లోకి రానున్నారట.

ఇప్పటికే పలు సినిమాల్లో ప్రభుత్వాలపై హీరోయిజం చూపిన ఈ నటుడు నిజజీవితంలోనూ రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతన్నారట. ఈ క్రమంలో ప్రస్తుతం జిల్లాల వారీగా అభిమాన సంఘాలతో విజయ్ భేటీ అవుతున్నారు. దక్షిణ తమిళనాడులోని మధురై, దిండిగల్‌, తిరునల్వేలితో సహా పలు జిల్లాల్లో అధ్యక్షులతో ఆయన భేటీ అయ్యరు. ఈ కార్యక్రమం మరో వారం రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్‌ రాజకీయాల్లోకి వస్తారన్న చర్చ ప్రస్తుతం తమిళనాట వినిపిస్తోంది.

కాగా కోలీవుడ్‌లో విజయ్‌కి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విజయ్‌.. మక్కల్ ఇయక్కమ్ పేరుతో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ మక్కల్‌ ఇయక్కమ్‌నే రాజకీయ పార్టీగా మార్చే యోచలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో విజయ్ పోటీ చేస్తారా..? లేక ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తారా అన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.

Read More:

Sushant Singh: సుశాంత్‌పై హృతిక్ తల్లి కీలక పోస్ట్‌

ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ చూపించిన కాజల్‌

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu