Kajal Aggarwal: ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ చూపించిన కాజల్‌

టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ మరో ఆరు రోజుల్లో శ్రీమతిగా మారనున్నారు. ముంబయికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లును

  • Manju Sandulo
  • Publish Date - 10:40 am, Sat, 24 October 20

Kajal Engagement ring: టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ మరో ఆరు రోజుల్లో శ్రీమతిగా మారనున్నారు. ముంబయికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లును ఈ నెల 30న కాజల్‌ వివాహం చేసుకున్నారు. చాలా తక్కువ మంది అతిథులతో వీరి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో తన పెళ్లి విశేషాలను కాజల్ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తన ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ని కాజల్ ఓ వీడియోలో షేర్ చేశారు.

షాది వానిటీ పేరుతో తన వేలికి ఉన్న రింగ్‌ని కాజల్‌ చూపించారు. ఆ తరువాత సూపర్‌, ఓకే అంటూ వేళ్లతో సంఙ్ఞలు ఇచ్చారు. చూస్తుంటే ఆ రింగ్‌ డైమండ్‌ది ఉన్నట్లు ఉండగా.. రింగ్‌ బావుందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు గౌతమ్‌ కిచ్లు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. వెడ్డింగ్ షాపింగ్‌.. నా పెళ్లి దుస్తులను ఏ డిజైనర్‌ సిద్ధం చేస్తున్నారని అనుకుంటున్నారు..? అని కామెంట్ పెట్టారు. కాగా పెళ్లి తరువాత కూడా తాను సినిమాల్లో నటిస్తానని కాజల్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో కొత్తగా 1,273 పాజిటివ్ కేసులు.. 5 మరణాలు

నా బెస్ట్‌ఫ్రెండ్‌ ఇప్పుడొక ట్రాన్స్‌జెండర్‌: ఉపాసన

https://www.instagram.com/p/CGrgzxxHPGS/?utm_source=ig_embed