హస్తినలో పతాక స్థాయికి చేరిన వాయుకాలుష్యం

దేశ రాజధాని హస్తిన మళ్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. ఢిల్లీలో ఈ ఉదయం వాయుకాలుష్యం పతాక స్థాయికి చేరింది. అలీపూర్‌లో గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) 432, ముండ్కాలో 427, వజీపూర్‌లో 409 నమోదైంది. (గాలి నాణ్యత 0-50 మధ్య ఉంటే శుద్ధమైందిగా, 51-100 మధ్య సంతృప్తికరంగా, 101-200 మితంగా, 201-300 మధ్య పేలవమైన, 301-400 చాలా పేలవమైన, 401-500 తీవ్రమైన కాలుష్యంగా పరిగణిస్తున్నారు.)  కాలుష్యం పెరుగడంతో ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులను ఎదుర్కొంటున్నారు. మరికొందరు పిల్లలు […]

  • Venkata Narayana
  • Publish Date - 11:49 am, Sat, 24 October 20
హస్తినలో పతాక స్థాయికి చేరిన వాయుకాలుష్యం

దేశ రాజధాని హస్తిన మళ్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. ఢిల్లీలో ఈ ఉదయం వాయుకాలుష్యం పతాక స్థాయికి చేరింది. అలీపూర్‌లో గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) 432, ముండ్కాలో 427, వజీపూర్‌లో 409 నమోదైంది. (గాలి నాణ్యత 0-50 మధ్య ఉంటే శుద్ధమైందిగా, 51-100 మధ్య సంతృప్తికరంగా, 101-200 మితంగా, 201-300 మధ్య పేలవమైన, 301-400 చాలా పేలవమైన, 401-500 తీవ్రమైన కాలుష్యంగా పరిగణిస్తున్నారు.)  కాలుష్యం పెరుగడంతో ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులను ఎదుర్కొంటున్నారు. మరికొందరు పిల్లలు గొంతు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చేపే అవకాశం ఉందని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) తెలిపింది.