స్విగ్గీ కంపెనీలో తమిళ హిజ్రాకు కీలక పదవి..
హిజ్రాకి చెందిన సంయుక్తా విజయన్‌ను స్విగ్గీలో కీలక పదవి వరించింది. సంయుక్తను ప్రిన్సిపల్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా నియమించారు. ఈ పదవిలో చదువుకున్న మూడో కేటగిరి వారికి ప్రాధాన్యమిచ్చే విధంగా తాను ముందుకు సాగుతానని సంయుక్త తెలిపారు. పురుషులు, స్త్రీలతో సమానంగా హిజ్రాలు కూడా అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారు. ప్రభుత్వాలు, కోర్టులో సైతం వారికి అండగా నిలవడంతో.. వారు తమకు నచ్చిన ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంయుక్తా విజయన్ తమిళనాడు వాసి.. తాను హిజ్రాగా […]
హిజ్రాకి చెందిన సంయుక్తా విజయన్‌ను స్విగ్గీలో కీలక పదవి వరించింది. సంయుక్తను ప్రిన్సిపల్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా నియమించారు. ఈ పదవిలో చదువుకున్న మూడో కేటగిరి వారికి ప్రాధాన్యమిచ్చే విధంగా తాను ముందుకు సాగుతానని సంయుక్త తెలిపారు. పురుషులు, స్త్రీలతో సమానంగా హిజ్రాలు కూడా అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారు. ప్రభుత్వాలు, కోర్టులో సైతం వారికి అండగా నిలవడంతో.. వారు తమకు నచ్చిన ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంయుక్తా విజయన్ తమిళనాడు వాసి.. తాను హిజ్రాగా ఉన్నా కుటుంబం అందించిన ప్రోత్సాహంతో సంయుక్తా పిఎస్‌జి కాలేజీ ఆఫ్ టెక్నాలజీలో బీఇ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పూర్తి చేశారు. అమెరికా, ఐరోపాల్లో ఫ్యాషన్ రంగంలోని కొన్ని సంస్థల్లో పనిచేశారు. భారత్‌కు తిరిగి వచ్చిన అనంతరం అమెజాన్‌లో పనిచేశారు. సొంతంగా ఫ్యాషన్ సంస్థను రన్ చేస్తున్నారు. ప్రస్తుతం స్వీగ్గీలో ప్రిన్సిపల్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా నియమించబడ్డారు. తనకు కుటుంబ ప్రోత్సాహం ఉండబట్టే ఈ స్థాయికి వచ్చానని సంయుక్తా చెప్పారు. తనలాంటి వారికి తల్లిదండ్రులు అక్కున చేర్చుకుని ఆదరించాలని ఆమె తెలిపారు. అలాగే ప్రభుత్వాలు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి.. మూడో కేటగిరికి చెందిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంయుక్త కోరారు.