చిన్నమ్మా! ఇక సెలవు: హాజరైన అగ్రనేతలు!
సుష్మా స్వరాజ్‌కు బీజేపీ నేతలు కడసారి వీడ్కోలు పలికారు. అశ్రునాయనాలతో మహా నేతకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్, జేపీ నడ్డా, రవిశంకర్, పీయుష్ గోయెల్ సహా పలువురు బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్ పార్థివ దేహానికి భుజం పట్టారు. లోధి శ్మశాన వాటికలో సుష్మా భౌతిక కాయానికి పలువురు నేతలు తుది వీడ్కోలు పలుకుతున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ అగ్రనేత […]

సుష్మా స్వరాజ్‌కు బీజేపీ నేతలు కడసారి వీడ్కోలు పలికారు. అశ్రునాయనాలతో మహా నేతకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్, జేపీ నడ్డా, రవిశంకర్, పీయుష్ గోయెల్ సహా పలువురు బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్ పార్థివ దేహానికి భుజం పట్టారు. లోధి శ్మశాన వాటికలో సుష్మా భౌతిక కాయానికి పలువురు నేతలు తుది వీడ్కోలు పలుకుతున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ అగ్రనేత ఆద్వాణీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తదితరులు సుష్మా పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. ఈ సమయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య ఉద్వేగానికి గురయ్యారు.