ఆమె తెచ్చే చాక్లెట్ కేక్… నాకో బంపర్ గిఫ్ట్… అద్వానీ

సుష్మా స్వరాజ్ మృతి పట్ల బీజేపీ అగ్రనేత, మాజీ డిప్యూటీ పీఎం ఎల్.కె. అద్వానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. హృదయాన్ని కదిలించే లేఖ రాశారు. ఆమెను తన శిష్యురాలిగా భావించే అద్వానీ.. తన మనసులోని ‘ స్మృతులను ‘ ఈ లేఖ రూపంలో పంచుకున్నారు. తన టీమ్ లో సుష్మ ఎలా చేరారో గుర్తు చేస్తూ ఆయన రాసిన లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది. ‘ నాకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన సుష్మా స్వరాజ్ జీ […]

ఆమె తెచ్చే చాక్లెట్ కేక్... నాకో బంపర్ గిఫ్ట్... అద్వానీ
Follow us

|

Updated on: Aug 07, 2019 | 6:21 PM

సుష్మా స్వరాజ్ మృతి పట్ల బీజేపీ అగ్రనేత, మాజీ డిప్యూటీ పీఎం ఎల్.కె. అద్వానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. హృదయాన్ని కదిలించే లేఖ రాశారు. ఆమెను తన శిష్యురాలిగా భావించే అద్వానీ.. తన మనసులోని ‘ స్మృతులను ‘ ఈ లేఖ రూపంలో పంచుకున్నారు. తన టీమ్ లో సుష్మ ఎలా చేరారో గుర్తు చేస్తూ ఆయన రాసిన లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది. ‘ నాకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన సుష్మా స్వరాజ్ జీ ఆకస్మిక మృతి నన్నెంతో కలచివేసింది. భారతీయ జనతా పార్టీలో తన తొలి అడుగు వేసినప్పటినుంచి ఆమె నాకు తెలుసు. 1980 ప్రాంతాల్లో నేను బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆమె ప్రతిభావంతురాలైన యువ కార్యకర్త. నా టీమ్ లో చేరిన కొన్నేళ్లలోనే సుష్మా స్వరాజ్ పార్టీలో పాపులర్, ప్రామినెంట్ లీడర్లలో ఒకరయ్యారు. మహిళా నాయకురాళ్లకు ఆమె ఓ రోల్ మోడల్ గా ఉండేవారు. మంచి వక్త కూడా. ఆయా సంఘటనలు, ఈవెంట్లను గుర్తు తెచ్చుకుని వాటిని ఎంతో స్పష్టంగా తిరిగి వివరించగల ఆమె సామర్థ్యాన్ని చూసి నేను తరచూ ఆశ్చర్యపోయేవాడ్ని. తన మానవతావాదం, మృదు స్వభావంతో ఆమె అందర్నీ ఆకట్టుకోగలిగేవారు. నా పుట్టిన రోజున నాకు అత్యంత ఇష్టమైన చాక్లెట్ కేక్ ను ఆమె తీసుకురాని సంవత్సరమంటూ లేదు. ఈ దేశం ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయింది. నాకు ఇది తీరని లోటు. సుష్మ లేకపోవడాన్ని ఎంతో మిస్ అవుతున్నా.. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఆమె కుమార్తె బన్సురికి, ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను ‘