AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ‌లుపులు తిరుగుతోన్న సుశాంత్ హ‌త్య కేసు.. కొత్త కోణాలు

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో సీబీఐ అధికారులు ముంబైకి చేరుకున్నారు. కేసును సుప్రీంకోర్టు సీబీఐకి బదిలీచేయడంతో ముంబై పోలీసుల నుంచి ఇప్పటి వరకు సేకరించిన వివరాలను సీబీఐ అధికారులు తీసుకోనున్నారు. ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన అధికారులు మీడియాతో..

మ‌లుపులు తిరుగుతోన్న సుశాంత్ హ‌త్య కేసు.. కొత్త కోణాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 20, 2020 | 9:32 PM

Share

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో సీబీఐ అధికారులు ముంబైకి చేరుకున్నారు. కేసును సుప్రీంకోర్టు సీబీఐకి బదిలీచేయడంతో ముంబై పోలీసుల నుంచి ఇప్పటి వరకు సేకరించిన వివరాలను సీబీఐ అధికారులు తీసుకోనున్నారు. ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన అధికారులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ కేసులో ఎవరెవరిని అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న దానికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు.

కేసు విచారణ అనేక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో సుశాంత్‌సింగ్‌ స్నేహితుడు శామ్యూల్‌ హోకిప్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సుశాంత్, సారా అలీ ఖాన్ ప్రేమించుకున్నారన్నాడు. కేదార్‌నాథ్ చిత్రంలో సుశాంత్, సారాలు కలిసి నటించారని, ఈ నేపథ్యంలోనే వారిద్దరు ప్రేమించుకున్నారని శామ్యూల్ చెప్పాడు. అయితే ఆ తర్వాత చిత్రం సోన్ చిరియా ఫ్లాప్ కావడంతో సారా సుశాంత్‌తో బ్రేకప్ చేసుకుందని… ఆ విషయం తెలిసి తాను ఆశ్చర్యపోయానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. సోన్‌చిరియా ఫ్లాప్ అవ్వడానికి బాలీవుడ్ మాఫియానే కారణమ’ని శామ్యూల్ హోకిప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు.

ఇప్పటికే సుశాంత్‌రాజ్‌పుత్‌ మరణానికి కారణం.. బాలీవుడ్‌లోని నెపోటిజమే కారణమన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో శామ్యూల్‌ కామెంట్లు మరింత కలకలం రేపుతున్నాయి. సుశాంత్‌ తండ్రి న్యాయం కోసం సీబీఐతో విచారణ జరిపించాలని కోరగా.. సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ నేపథ్యంలో ముంబైకి చేరుకున్న సీబీఐ అధికారులు.. సుశాంత్‌ స్నేహితులతో పాటు అతని ప్రియురాలు రియాను కూడా విచారించే అవకాశం కనిపిస్తోంది.

అనేక మలుపుల మధ్య సుశాంత్‌ కేసు సీబీఐకి చేరడంతో… ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం బలపడుతోంది.

View this post on Instagram

We accept the love we think we deserve -Stephen Chbosky

A post shared by Samuel Haokip (@jamlenpao) on

Read More:

తెలంగాణ‌లో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వ‌ర్షాలు!

సెప్టెంబ‌ర్ 5న రిలీజ్ అవుతోన్న ”వి” సినిమా

నాతో పాటు నా కూతురికి కూడా క‌రోనా సోకిందిః మాళ‌విక‌