కన్నీళ్లు తుడుచుకో సిస్టర్.. అండగా ‘నేనున్నాను’..
సాయం అంటే చాలు.. నేనున్నానంటూ ముందుకు వస్తున్నాడు నటుడు సోనూసూద్. కరోనా కష్టకాలంలో అతడు చేసిన సాయం అంతా ఇంతా కాదు.

Twitter Hero Sonu Sood: సాయం అంటే చాలు.. నేనున్నానంటూ ముందుకు వస్తున్నాడు నటుడు సోనూసూద్. కరోనా కష్టకాలంలో అతడు చేసిన సాయం అంతా ఇంతా కాదు. ఎంతోమంది వలస కార్మికులను ప్రత్యేక బస్సులు, రైళ్లు, విమానాల్లో స్వస్థలాలకు చేర్చాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో మంచి పనికి సిద్దమవుతున్నాడు. అకాల వర్షాలు కారణంగా తన పుస్తకాలు తడిచి ముద్దైపోయాయని బాధపడుతున్న బాలికకు అన్నలా నేనున్నాను అంటూ ముందుకు వచ్చాడు. వివరాల్లోకి వెళ్తే..
ఛత్తీస్‌ఘడ్‌లోని మావోయిస్టు ప్రభావిత జిల్లా బిజాపూర్, బస్తర్‌లో గత కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీని వల్ల అంజలి అనే బాలిక ఇల్లు కూలిపోయింది. ఈ విషయాన్ని ఆ గ్రామానికి చెందిన ఓ జర్నలిస్ట్ వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అది అటు తిరిగి.. ఇటు తిరిగి.. సోనూసూద్ దగ్గరికి చేరింది.
దానికి సోనూసూద్ స్పందిస్తూ.. ”కన్నీళ్లు తుడుచుకో సిస్టర్.. పుస్తకాలు కొత్తవి వస్తాయి. ఇల్లు కూడా కొత్తది వస్తుంది” అని ట్వీట్ చేశాడు. అటు ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాగేళ్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఆ బాలిక కుటుంబానికి తగిన సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read:
కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..
आंसू पोंछ ले बहन… किताबें भी नयीं होंगी.. घर भी नया होगा। https://t.co/crLh48yCLr
— sonu sood (@SonuSood) August 19, 2020
