కొండ చిలువకు సర్జరీ.. స్నేక్ క్యాచర్ ఔదార్యం, ఏలూరు వైద్యుల ఘనత, కొండ చిలువను అడవిలో వదిలేయాలని నిర్ణయం
మత్స్యకారుని వలకు చిక్కుకుని తీవ్రంగా గాయపడిన ఓ కొండ చిలువకు సర్జరీ చేశారు పశ్చిమగోదావరి జిల్లా వైద్యులు. జంగారెడ్డిగూడెంలో ఈ చికిత్స జరిగింది. శస్త్రచికిత్స విజయవంతమైందని...

Surgery to save python life: మత్స్యకారుని వలకు చిక్కుకుని తీవ్రంగా గాయపడిన ఓ కొండ చిలువకు సర్జరీ చేశారు పశ్చిమగోదావరి జిల్లా వైద్యులు. జంగారెడ్డిగూడెంలో ఈ చికిత్స జరిగింది. శస్త్రచికిత్స విజయవంతమైందని, కొండ చిలువ (Python) కోలుకున్న తర్వాత దానిని అడవిలో వదిలేస్తామని ఫారెస్టు అధికారులు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ఓ మత్స్యకారుని వలలో ఇటీవల ఈ కొండ చిలువ చిక్కుకుంది. వెలుపలికి తీసిన తర్వాత చూస్తే అది తీవ్రంగా గాయపడి వుంది. తీవ్ర గాయాలపాలైన కొండ చిలువను స్నేక్ క్యాచర్ క్రాంతి రక్షించే ప్రయత్నం చేశాడు. దానిని సమీపంలో వున్న పశువుల ఆసుపత్రికి తరలించాడు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు.
కొండ చిలువకు అయిన గాయాలకు శస్త్రచికిత్స చేశారు జంగారెడ్డి గూడెం పశువైద్యులు. సర్జరీ విజయవంతమైందని వారు గురువారం వెల్లడించారు. అయితే కొండ చిలువకు అయిన గాయాలు నయమవడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని, ఆ తర్వాత దానిని ఫారెస్టు అధికారులకు అప్పగిస్తామని వైద్యులు తెలిపారు. గాయాలు నయమయిన తర్వాత కొండ చిలువను అటవీ ప్రాంతంలో వదిలేస్తామని ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. స్నేక్ క్యాచర్ క్రాంతిని పలువురు అభినందించారు.
ALSO READ: ‘చేయూత‘కు 151 కోట్లు.. మంజూరు చేసిన సర్కార్
ALSO READ: ఆర్థిక ప్రగతికి 12 కీలక నిర్ణయాలు.. వెల్లడించిన నిర్మల