ఈ నెలాఖరుకే మోడెర్నా కంపెనీ కొవిడ్ 19 వ్యాక్సీన్ ఫలితాలు, గుడ్ న్యూస్ ! వెయిట్ చేస్తున్న ఇండియా
తన కోవిడ్-19 వ్యాక్సీన్ ఫలితాలను మోడెర్నా కంపెనీ నెలాఖరులోగా ప్రకటించవచ్ఛునని తెలుస్తోంది.తొలి అనాలిసిస్ కి సంబంధించిన డేటాను సేకరించే..
తన కోవిడ్-19 వ్యాక్సీన్ ఫలితాలను మోడెర్నా కంపెనీ నెలాఖరులోగా ప్రకటించవచ్ఛునని తెలుస్తోంది.తొలి అనాలిసిస్ కి సంబంధించిన డేటాను సేకరించే పని పూర్తి కావడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. సుమారు 30 వేలమంది వలంటీర్లపై ఈ సంస్థ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా వీరిలో సగం మందికి వ్యాక్సీన్ ఇచ్చి..మిగిలినవారికి ఎలాంటి ఎఫెక్టులు ఇవ్వని టాబ్లెట్స్ వంటివి ఇచ్చారు. ఈ కంపెనీ అభివృధ్ది పరుస్తున్న టీకామందు మేలైనదా కాదా అన్నది తేలాలంటే.. మొదట సుమారు 53 మంది వలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మదింపు చేయవలసి ఉంటుంది. వీరు అస్వస్థత బారిన పడ్డారా, రోజువారీవీరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వంటి విషయాలను పరిశీలించవలసి ఉంటుంది. ఇదే సమయంలో ఈ సంస్థ నిపుణులతో కూడిన డేటా అండ్ సేఫ్టీ మానిటరింగ్ బోర్డుకు తన ఎనలిటికల్ డేటాను పంపేందుకు సిధ్ధపడుతోంది.