AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (February 14, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో శుభవార్తలు వినిపించే సూచనలు ఉన్నాయి. వృషభ రాశి వారికి పదోన్నతితో కూడిన మార్పులు సంభవించవచ్చు. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగడంతో పాటు వ్యాపారాల్లో లాభాలు పొందే అవకాశం ఉంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.

Horoscope Today: వారు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 14 Feb 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (ఫిబ్రవరి 14, 2026): మేష రాశి వారు ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. పదోన్నతితో కూడిన స్థాన చలనానికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివాదం రాజీమార్గంలో పరిష్కారమవుతుంది. ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు పొందు తారు. ప్రయత్నాలన్నీ చాలావరకు సఫలం అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. పదోన్నతితో కూడిన స్థాన చలనానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం అనుకూలంగా సాగుతుంది. కొన్ని వ్యక్తిగత వ్యవహారాల్లో బంధువులను తలదూర్చనివ్వవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొన్ని అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. సమాజంలోని అతి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారదిశగా సాగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు తగ్గుతాయి. సొంత ఆలోచనల వల్ల లాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల తోడ్పాటు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చులకు కళ్లెం వేయాల్సి ఉంటుంది. కొద్దిపాటి ఇబ్బందులున్నా ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. పట్టుదలగా కొన్ని అత్యవసర పనుల్ని పూర్తి చేస్తారు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అసంతృప్తి ఏర్పడు తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా పనిభారం, ఒత్తిడి బాగా తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా అనుకూలంగా మారుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి సలహాల వల్ల ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యానికి లోటుండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థికంగా రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ వార్తలు వింటారు. మిత్రులకు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఊహించని ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. కొత్త ఆలోచనలకు, ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో ప్రాధాన్యానికి, ప్రాభవానికి లోటుండదు. అధికారులు కొత్త బాధ్యతలను అప్పజెప్పే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో సరైన గుర్తింపు లభించడంతో పాటు డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. ఇంటా బయటా మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ప్రయత్నాలన్నీ సానుకూల ఫలితాలనిస్తాయి. వ్యక్తిగత విషయాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆదాయానికి లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్త అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ఎటువంటి వ్యాపారాలైనా చాలా వరకు లాభాల బాటలో సాగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఆశించిన కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి, లాభం పొందుతారు. ఆర్థికంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అదనపు బాద్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. అధికారులకు మీ పనితీరు బాగా నచ్చుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఊహించని అదృష్టాలు పడతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలకు అనుకోకుండా పరిష్కారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.