AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రఫేల్‌పై రివ్యూ పిటిషన్లను పరిశీలిస్తాం: సుప్రీం

రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై తక్షణ విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.

రఫేల్‌పై రివ్యూ పిటిషన్లను పరిశీలిస్తాం: సుప్రీం
Ram Naramaneni
|

Updated on: Sep 01, 2020 | 3:10 PM

Share

దిల్లీ: రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై తక్షణ విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. రఫేల్‌ తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై తక్షణ విచారణ చేపట్టాలని సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ స్పందిస్తూ.. ‘ఈ పిటిషన్లను విచారించేందుకు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. ఇది కాస్త కష్టమైన పని. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం’ అని అన్నారు.

రఫేల్‌ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం గతేడాది డిసెంబరు 14న తుది తీర్పు వెల్లడించింది. రఫేల్‌ ఒప్పందం నిర్ణయ ప్రక్రియను సందేహించడానికి ఎలాంటి ప్రాతిపదికా కన్పించలేదని కోర్టు పేర్కొంది. ఈ యుద్ధ విమానాల ఆవశ్యకత, నాణ్యతపై ఎలాంటి అనుమానాలూ లేవని, ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన అవసరమేమీ లేదని తెలిపింది. ఈ మేరకు ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. అయితే, ఈ తీర్పును మరోసారి సమీక్షించాలని కోరుతూ న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్లు దాఖలవ్వడంతో కోర్ట్ ఈ వ్యాఖ్యాలు చేసింది.

OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా