పాకిస్తాన్‌ ముర్దాబాద్‌ అంటే చికెన్‌ లెగ్ పీస్ పై రూ. 10 తగ్గింపు

పుల్వామ ఘటనతో పాక్ పేరుచెబితేనే దేశం మండిపడుతోంది. ఎటు చూసినా పాకిస్థాన్ కు వ్యతిరేక నినాదాలు, నిరసనలు హోరెత్తున్నాయి. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఓ చెప్పుల వ్యాపారి పాకిస్థాన్ పై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తన వ్యాపారానికి ప్రచారాస్త్రంగా మార్చుకున్నాడు. మరోవైపు మధ్యప్రదేశ్ లో రైతులు తమకు నష్టం వాటిల్లినా సరే.. పాకిస్థాన్ కు మాత్రం టమాటాలను ఎగుమతి చేసేది లేదని తేల్చిచెప్పారు. దీంతో పాకిస్తాన్ లో టమాట ధరలకు రెక్కలొచ్చాయి. కేజీ టమాట […]

పాకిస్తాన్‌ ముర్దాబాద్‌ అంటే  చికెన్‌ లెగ్ పీస్ పై రూ. 10 తగ్గింపు
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 9:55 PM

పుల్వామ ఘటనతో పాక్ పేరుచెబితేనే దేశం మండిపడుతోంది. ఎటు చూసినా పాకిస్థాన్ కు వ్యతిరేక నినాదాలు, నిరసనలు హోరెత్తున్నాయి. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఓ చెప్పుల వ్యాపారి పాకిస్థాన్ పై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తన వ్యాపారానికి ప్రచారాస్త్రంగా మార్చుకున్నాడు. మరోవైపు మధ్యప్రదేశ్ లో రైతులు తమకు నష్టం వాటిల్లినా సరే.. పాకిస్థాన్ కు మాత్రం టమాటాలను ఎగుమతి చేసేది లేదని తేల్చిచెప్పారు. దీంతో పాకిస్తాన్ లో టమాట ధరలకు రెక్కలొచ్చాయి. కేజీ టమాట వంద రూపాయలకు పైగా పెరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీరినే ఆదర్శంగా తీసుకున్నాడో లేదా తనకు తానుగా ఈ ఆలోచన వచ్చిందో కానీ చత్తీస్ గఢ్ లోని ఓ ఫుడ్ స్టాల్ యజమాని తన వ్యాపారంతో వినియోగదారుల్లో దేశభక్తి కలిగించే పనిలో పడ్డాడు. తన దగ్గర ఎక్కువగా అమ్ముడుపోయే చికెన్ లెగ్ పీస్ లపై రూ.10ల డిస్కౌంట్ ప్రకటించాడు. అయితే దీనికి ఓ షరతు పెట్టాడు. అక్కడికి వచ్చిన వారు మనస్పూర్తిగా పాకిస్థాన్ ముర్దాబాద్ అని నినాదాలు చేయాలి. పాకిస్థాన్ ఎప్పుడూ మానవత్వానికి విలువ ఇవ్వలేదు. ఇవ్వదుకూడా. అందుకే ప్రతి ఒక్కరు పాకిస్థాన్ ముర్దాబాద్ అని అనాలని ఫుడ్ స్టాల్ యజమాని అంజల్ సింగ్ అంటున్నారు.