ఐస్ బాక్స్‌లపై కూర్చొని తమ ప్రాణాలు కాపాడుకున్నారు..
నడిసంద్రంలో చేపల వేటకు వెళ్లిన బోటును ఓ నౌక ఢీ కొట్టింది. దీంతో.. మత్య్సకారుల పడవ రెండు ముక్కలయ్యింది. పడవలో ఉన్న నలుగురు జాలర్లకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాకుళం నుంచి అండమాన్ తీరంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ ప్రమాదానికి గురయ్యింది. ఐస్ బాక్స్‌లపై కూర్చొని తమ ప్రాణాలను కాపాడుకున్నారు జాలర్లు. చిమ్మచీకటిలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు నరకయాతన అనుభవించారు నలుగురు జాలర్లు. అటుగా వెళ్తున్న మరో బోటులోని […]
నడిసంద్రంలో చేపల వేటకు వెళ్లిన బోటును ఓ నౌక ఢీ కొట్టింది. దీంతో.. మత్య్సకారుల పడవ రెండు ముక్కలయ్యింది. పడవలో ఉన్న నలుగురు జాలర్లకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాకుళం నుంచి అండమాన్ తీరంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ ప్రమాదానికి గురయ్యింది. ఐస్ బాక్స్‌లపై కూర్చొని తమ ప్రాణాలను కాపాడుకున్నారు జాలర్లు.
చిమ్మచీకటిలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు నరకయాతన అనుభవించారు నలుగురు జాలర్లు. అటుగా వెళ్తున్న మరో బోటులోని మత్య్సకారులు వాళ్ల కేకలు విని నలుగురి ప్రాణాలు కాపాడారు. అండమాన్ తీరంలోని నీల ఐల్యాండ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు శ్రీకాకుళం సోంపేటకు చెందిన వారుగా గుర్తింపు.